స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించాల్సిన అవసరం లేదు : ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ

భారతీయ విద్యా విధానంలో దేశీయతకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రత్యామ్నాయ సిలబస్‌ రూపకల్పనపై తమ సంస్థ పనిచేస్తోందని శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్ సెక్రటరీ అతుల్ కొఠారి తెలిపారు.

news18-telugu
Updated: August 28, 2019, 12:00 PM IST
స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించాల్సిన అవసరం లేదు : ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు బోధించాల్సిన అవసరం లేదని.. ఆ రకమైన ఎడ్యుకేషన్‌తో విద్యార్థులపై దుష్ప్రభావం పడుతోందని ఆర్ఎస్ఎస్‌ అనుబంధ సంస్థ 'శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్(SSUN)' మంగళవారం పేర్కొంది.పాఠశాల సిలబస్‌లో సెక్స్ ఎడ్యుకేషన్‌ను చేర్చాల్సిన అవసరం లేదని..ఒకవేళ అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ అందించాలని శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్ వ్యవస్థాపకుడు దీననాథ్ బత్రా అభిప్రాయపడ్డారు.కేంద్రం ప్రతిపాదించిన కొత్త విద్యా చట్టాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

కేంద్రం నియమించిన ఆర్కే కస్తూరిరంగన్ కమిటీ కొత్త విద్యా చట్టానికి సంబంధించిన ముసాయిదాను రూపొందించింది.ఈ ఏడాది మే నెలలో మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్‌కు ఆ నివేదికను అందజేసింది.సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్‌లో..వేధింపులు,మహిళా గౌరవం,ఫ్యామిలీ ప్లానింగ్,పరస్పర అంగీకారం,భద్రతా,లైంగిక వ్యాధుల నియంత్రణ వంటి టాపిక్స్‌ను చేర్చినట్టు నివేదికలో కమిటీ పేర్కొంది.అయితే విద్యార్థులకు ఈ టాపిక్స్ బోధించాల్సిన అవసరం లేదని దీననాథ్ బత్రా అంటున్నారు. భారతీయ విద్యా విధానంలో దేశీయతకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రత్యామ్నాయ సిలబస్‌ రూపకల్పనపై తమ సంస్థ పనిచేస్తోందని శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్ సెక్రటరీ అతుల్ కొఠారి తెలిపారు.

స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించవచ్చు. అంతేకాదు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు మానవ శరీరం గురించి, అందులోని అవయవాల గురించి చెబితే సరిపోతుంది. సైన్స్ సబ్జెక్ట్ ద్వారా ఇప్పటికే ఆ టాపిక్స్ బోధిస్తున్నారు. అలాంటప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్‌ను బోధించాల్సిన అవసరమేంటి.
అతుల్ కొఠారి,శిక్షా సంస్కృతి ఉత్తాన్ న్యాస్ సెక్రటరీ


.
Published by: Srinivas Mittapalli
First published: August 28, 2019, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading