అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్

India : పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆర్మీ చీఫ్... భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు. అవసరమైతే LOC దాటి వెళ్లి మరీ యుద్ధం చేస్తామన్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 10:19 AM IST
అవసరమైతే LOC దాటతాం... పాకిస్థాన్‌కి ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్
బిపిన్ రావత్
  • Share this:
Army Chief General Bipin Rawat : పాకిస్థాన్-భారత్ వాస్తవాధీన రేఖను దాటి సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని ప్రకటించారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. పాకిస్థాన్ తీరు మార్చుకోనంతవరకూ తమ దాడులు కొనసాగుతాయన్నారు ఆయన. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడిన ఆయన... ఇకపై "హైడ్ అండ్ సీక్‌"లు కుదరవన్న ఆయన... ఇండియా గనక సరిహద్దు దాటాలని అనుకుంటే... గగనతలంలో, భూ మార్గంలో లేదా రెండు మార్గాల్లోనూ దాటతామని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం జమ్మూకాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత... పాకిస్థాన్ ప్రభుత్వం జీహాద్ ప్రకటించిందన్న ఆయన... పొరుగు దేశం కావాలనే ప్రచ్ఛన్న యుద్ధం జరిపిస్తోందని అన్నారు.

అణ్వాయుద్ధాలతో యుద్ధం చేస్తామన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని కూడా బిపిన్ రావత్ కొట్టిపారేశారు. అంతర్జాతీయ సమాజం అలాంటి చర్యల్ని అనుమతించదని అన్నారు. అణ్వాయుధాలనేవి రక్షణ కోసమే తప్ప యుద్ధం కోసం కాదన్నారు ఆయన.

ఆగస్ట్ 5 తర్వాత సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగినట్లున్నాయి అన్న ప్రశ్నకు ఆర్మీ చీఫ్ అవునంటూనే... ఇండియన్ ఆర్మీ... అలాంటి వాటిని సమర్థంగా ఎదుర్కొంటోందనీ, అనుమానం ఉన్న ఏ ఒక్క అంశాన్నీ వదలట్లేదనీ తెలిపారు. జమ్మూకాశ్మీర్‌ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత... భారత్, పాకిస్థాన్ మధ్య టెన్షన్లు పెరిగాయన్నారు.

కాశ్మీర్‌లోయలో పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు ఆయన... అత్యధిక శాతం ప్రజలు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తమ మేలు కోసమేనని గ్రహిస్తున్నారని తెలిపారు. 30 ఏళ్ల హింస తర్వాత... ప్రజలకు ఓ శాంతి అవకాశం దొరికిందన్నారు.
Published by: Krishna Kumar N
First published: September 30, 2019, 10:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading