బిర్యానీ ఉండదు.. పార్లమెంట్‌ క్యాంటీన్‌లో శాఖాహారం మాత్రమే..?

IRCTC నిర్వహణ సరిగా లేదని.. ఆహారపదార్థాల్లో నాణ్యత లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త క్యాటరింగ్ సంస్థను నియమించబోతున్నారు.

news18-telugu
Updated: January 14, 2020, 7:18 PM IST
బిర్యానీ ఉండదు.. పార్లమెంట్‌ క్యాంటీన్‌లో శాఖాహారం మాత్రమే..?
పార్లమెంట్ భవనం
  • Share this:
పార్లమెంట్ క్యాంటిన్ నిర్వహణలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. పార్లమెంట్‌లో ఉండే ఐదు క్యాంటిన్లలో ఇకపై మాంసాహారాన్ని వడ్డించకూడదని స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా యోచిస్తున్నారు. బిర్యానీ, చేపలు, చిప్స్‌కు స్వస్తి పలికే యోచనలో ఉన్నారు. అంతేకాదు క్యాంటిన్ నిర్వహణ బాధ్యతల నుంచి ఇండియన్ రైల్వేస్ సబ్సిడరీ సంస్థ IRCTCని తప్పించి.. ప్రైవేట్ సంస్థ క్యాటరింగ్ సంస్థలైన హల్దీరామ్, బికనేర్‌వాలలో ఒకరికి కాంట్రాక్ట్ అప్పగించాలని భావిస్తున్నారు.

IRCTC నిర్వహణ సరిగా లేదని.. ఆహారపదార్థాల్లో నాణ్యత లేదని ఎంపీల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త క్యాటరింగ్ సంస్థను నియమించబోతున్నారు. ఐతే పార్లమెంట్ క్యాంటిన్లలో బిర్యానీ, చేపలు, చికెన్ కట్‌లెట్, చిప్స్‌కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దాంతో మెనూ నుంచి మంసాహారాన్ని తొలగిస్తే కొందరు ఎంపీలు అభ్యంతరం చెప్పే అవకాశముంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

పార్లమెంట్‌లోని క్యాంటిన్‌లోని ఆహార పదార్థాలపై ఎంపీలు, సిబ్బందికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. ఆహార పదార్థాలపై ఏటా రూ.17 కోట్లు ఖర్చవుతుండగా.. వీటిలో దాదాపు రూ.14 కోట్లను పార్లమెంట్ సిబ్బంది, సందర్శకులే వినియోగించుకుంటున్నారు. ఎంపీలు తక్కువ మొత్తంలో వినియోగించుకున్నారు. అంతేకాదు చివరగా 2016లో మెనూ ధరలను సవరించారు. కోటాను కోట్ల ఆస్తులుండే ఎంపీలకు అతి తక్కువ ధరకే సబ్సిడీపై ఆహారం అందించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెను ధరలను కూడా పెంచాలని యోచిస్తున్నారు.First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>