NO MORE A CHAIWALA MAYAWATI TAKES A DIG AT PM MODIS CHOWKIDAR CAMPAIGN
చౌకీదార్.. మీ చాయ్‌వాలా నాటకం పూర్తి అయ్యిందా...మోడీపై మాయా ట్వీట్
మాయావతి
"బీజేపీ ప్రారంభించిన 'మై భీ చౌకీదార్' ద్వారా ఇక నుంచి మోడీ చాయ్‌వాలాగా కాకుండా పోయారని, దేశం బీజేపీ సాక్షిగా భారీ మార్పును చూస్తోంది" అంటూ మాయవతి విమర్శించారు.
ప్రధాని మోడీ "మై భీ చౌకీదార్" కాంపెయిన్‌పై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి మొదలైంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయవతి సైతం చౌకీదార్ కాంపెయిన్ పై విరుచుకుపడ్డారు. గతంలో చాయ్ వాలా అని ప్రచారం చేసుకున్న మోడీ ఇప్పుడు చౌకీదార్ (కాపలాదారుడు) పేరు ముందుకు తగిలించుకోవడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. "బీజేపీ ప్రారంభించిన 'మై భీ చౌకీదార్' ద్వారా ఇక నుంచి మోడీ చాయ్‌వాలాగా కాకుండా పోయారని, దేశం బీజేపీ సాక్షిగా భారీ మార్పును చూస్తోంది" అంటూ మాయవతి విమర్శించారు.
After BJP launch 'Mai Bhi Chowkidar' campaign, PM Modi & others added the prefix 'Chowkidar' to their Twitter handles. So now Narendra Modi is Chowkidar & no more a 'Chaiwala' which he was at the time of last LS election. What a change India is witnessing under BJP rule. Bravo!
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తనపై వచ్చిన చాయ్ వాలా పదాన్ని పలు సందర్భాల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే సమయంలో విరివిగా వాడుకొని భారీ విజయాన్ని నమోదుచేసారు. అయితే రాఫెల్ వివాదం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీని "చౌకీదార్ చోర్ హై" (కాపాలాదారుడే దొంగ) అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో చౌకీదార్ పదంతో ఈ సారి ఎన్నికల్లో ప్రతిపక్షాల విమర్శలను తిప్పిగొట్టేందుకు ప్రధాని మోడీ టీమ్ సిద్ధమైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.