హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Grain ATM: ఆ ఏటీఎం లో డబ్బులు రావు ? బియ్యం వస్తాయి .. విచిత్రంగా ఉంది కదా.. ఎక్కడంటే !

Grain ATM: ఆ ఏటీఎం లో డబ్బులు రావు ? బియ్యం వస్తాయి .. విచిత్రంగా ఉంది కదా.. ఎక్కడంటే !

ఆ ఏటీఎం లో డబ్బులు రావు ? బియ్యం వస్తాయి .. విచిత్రంగా ఉంది కదా..  ఎక్కడంటే !

ఆ ఏటీఎం లో డబ్బులు రావు ? బియ్యం వస్తాయి .. విచిత్రంగా ఉంది కదా.. ఎక్కడంటే !

ఏటీఎంల ద్వారా రేషన్‌ సరకులను (Ration) పంపిణీ చేసేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు కోసం లబ్ధిదారులకు ప్రత్యేక కోడ్‌ (Special Code) ఉన్న కార్డులను అందజేయనున్నారు.

ఆటోమేటెడ్‌ టెల్లర్‌ మెషీన్‌ల (ATM) ద్వారా బ్యాంక్‌ అకౌంట్‌లోని డబ్బులు తీసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వాటర్ ఏటీఎం వంటి మెషిన్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల ఓ సంస్థ మరో అడుగు ముందుకు వేసి ఏటీఎంల ద్వారా గోల్డ్ బిస్కెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. కొన్ని రాష్ట్రాలు గ్రెయిన్‌ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురావడం కూడా చూశాం. ఇప్పుడు ఏటీఎంల ద్వారా రేషన్‌ సరకులను (Ration) పంపిణీ చేసేందుకు ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందు కోసం లబ్ధిదారులకు ప్రత్యేక కోడ్‌ (Special Code) ఉన్న కార్డులను అందజేయనున్నారు.

జాతీయ, రాష్ట్ర ఆహార భద్రత కార్యక్రమాల పరిధిలో ఉన్న లబ్ధిదారులకు ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్‌(ATM)ల ద్వారా రేషన్ పంపిణీ చేసే ప్రాజెక్ట్‌ను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పైలట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం అయితే దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది.

ఈ విషయంపై మంగళవారం అసెంబ్లీలో ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి అతాను సబ్యసాచి నాయక్‌ మాట్లాడారు. ఒడిశా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో తొలి దశలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. తొలుత ఈ ప్రాజెక్ట్‌ సేవలు భువనేశ్వర్‌లో అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రేషన్‌ సరకుల పంపిణీలో వేగం పెరుగుతుందని, లబ్ధిదారులు క్యూ లైన్‌లలో వేచి ఉండే శ్రమ తప్పుతుందని పేర్కొన్నారు.

సేవలను పొందేందుకు లబ్ధిదారులకు ప్రత్యేక కోడ్ ఉండే కార్డును అందజేస్తారు. ఏటీఎంలో టచ్ స్క్రీన్ ఉన్న బయోమెట్రిక్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ లబ్ధిదారులు ఆధార్ లేదా రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్‌లో లబ్ధిదారులకు ప్రభుత్వం సూచించిన ఆహారధాన్యాలను యంత్రాల ద్వారా అందజేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), రాష్ట్ర ఆహార భద్రతా కార్యక్రమం(SFSP) కింద లబ్ధిదారులలో ఎక్కువ మందికి బియ్యం అందజేస్తున్నారు.

ఇదీ చదవండి: Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


రాష్ట్ర ప్రభుత్వం 2021లో ప్రపంచ ఆహార కార్యక్రమం(WFP)తో అనేక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, వరి సేకరణ, ధాన్యం ఏటీఎం, స్మార్ట్ మొబైల్ స్టోరేజీ యూనిట్ల రూపాంతరం ఈ ఒప్పందం కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులలో ఉన్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో దేశంలోనే తొలి 'గ్రెయిన్ ఏటీఎం'ని గతేడాది ఏర్పాటు చేశారు. ఈ యంత్రాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద ఇన్‌స్టాల్ చేశారు. దీనిని ఆటోమేటెడ్ మల్టీ కమోడిటీ, గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషిన్ అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా గ్రెయిన్ ఏటీఎంను ప్రవేశపెట్టింది.

ఎలా పని చేస్తుంది?

సరకులను సరఫరా చేసేందుకు, లబ్ధిదారులను ధ్రువీకరించేందుకు ఏటీఎంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఏటీఎంలో ప్రత్యేక బయోమెట్రిక్ వ్యవస్థ ఉంటుంది. లబ్ధిదారుల ఆధార్ లేదా రేషన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అథెంటికేషన్‌ పూర్తయిన తర్వాత లబ్ధిదారులకు ధాన్యాలు అందుతాయి.

Published by:Mahesh
First published:

Tags: ATM, Healthy food, Naveen Patnaik, Odisha, Ration Distribution

ఉత్తమ కథలు