Home /News /national /

NO LEAVE AND SALARY CUT IF EMPLOYEES TAKE PART IN BHARAT BANDH WARNS TAMIL NADU WEST BENGAL AND OTHER STATE GOVT MKS

Bharat Bandh: ఉద్యోగులు, కార్మికులకు షాక్ -భారత్ బంద్‌లో పాల్గొంటే జీతం కట్ -ప్రభుత్వ ఉత్తర్వులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర సర్కారు విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు సోమ, మంగళవారాల్లో భారత్ బంద్ చేపట్టనున్నాయి. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులు, కార్మికులకు సీరియన్ వార్నింగ్స్ ఇచ్చాయి..

ప్రభుత్వ రంగ సంస్థలు, ఉద్యోగుల సంక్షేమం, రైతులు తదితర అంశాల్లో కేంద్ర సర్కారు విధానాలను నిరసిస్తూ కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు సోమ, మంగళవారాల్లో భారత్ బంద్ చేపట్టనున్నాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ కూటమి ఈ మేరకు భారీ ఆందోళనలకు పిలుపునివ్వగా, రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా పలు రంగాలకు చెందిన 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొనబోతున్నారు. దీంతో బ్యాంకింగ్, పవర్, కోల్ తదితర సెక్టార్లలో సర్వీసులు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ఉద్యోగులు, కార్మికులకు సీరియన్ వార్నింగ్స్ ఇచ్చాయి..

సోమ, మంగళవారాల్లో (ఈ నెల 28, 29 తేదీల్లో) ట్రేడ్ యూనియన్లు నిర్వహించే భారత్ బంద్ ఆందోళనలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే జీతం కట్‌ చేస్తామని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు హెచ్చరించాయి. కేరళలోనూ హైకోర్టు.. సమ్మెలో పాల్గొనకుండా ఐదు కార్మిక సంఘాలను కట్టడి చేసింది. నిజానికి ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నప్పటికీ, కొన్ని గుర్తింపు పొందని సంఘాల సభ్యులు కూడా సమ్మెలో పాల్గొనబోతున్నారనే సమాచారంతో హెచ్చరికలు చేశాయి.

Bharat Bandh: సోమ, మంగళవారాల్లో భారత్ బంద్.. బ్యాంకింగ్ సర్వీసులకూ అంతరాయం -సమ్మెలో 20 కోట్ల మంది!


ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటుండగా, సోమ, మంగళవారాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తెరిచే ఉంటాయని బెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆందోళనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం, పాల్గొనేలా ఇతర ఉద్యోగులను భయాందోళనకు గురిచేయడం, ఆ పోరాటానికి మద్దతు పలికేలా వ్యవహరించడం ఎంతమాత్రం తగదని బెంగాల్ తోపాటు తమిళనాడు ప్రభుత్వాలు సర్క్యూలర్లు జారీ చేశాయి.

Nitish Kumar Attacked: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై దాడి : Bihar CM Shocking Video


భారత్ బంద్ జరిగే సోమ, మంగళవారాల్లో ఉద్యోగులకు సెలవులు వర్తించబోవని, ఒకవేళ ఎవరైనా బంద్ లో పాల్గొని ఆఫీసులకు, లేదా పనిలోకి రానట్లయితే వారి జీతంలో కోతలు విధిస్తామని ప్రభుత్వాలు హెచ్చరించాయి. కాగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం సమ్మెలో పాల్గొనబోయే ఉద్యోగులు, కార్మికుల పట్ల ఉదాసీనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సమ్మెలో పాల్గొంటే జీతం కోత లాంటి కఠిన నిర్ణయాలు రెండు రాష్టాలు మాత్రమే తీసుకున్నాయి.
Published by:Madhu Kota
First published:

Tags: Bank, Bharat Bandh, Employees, India

తదుపరి వార్తలు