లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న చిరువ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ల నేపథ్యంలో మే, జూన్, జులై మాసాలకు జీఎస్టీఆర్-3బీ ఫామ్‌లపై ఎలాంటి ఫైన్ వేయరాదని నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా దాఖలు చేసే రూ 5 కోట్ల టర్నోవర్ లోపు చిరువ్యాపారులపై ఎలాంటి ఆలస్య రుసుము, వడ్డీ వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక జులై 6 వరకూ జీఎస్టీ రిటన్స్‌ను దాఖలు చేసే పన్నుచెల్లింపుదారులపై అపరాథ వడ్డీ ఉండదని ఆమె పేర్కొన్నారు.
ఆ తర్వాత జీఎస్టీ రిటన్స్‌ను ఫైల్ చేసే చిరు పన్నుచెల్లింపుదారులపై విధించే వడ్డీ రేటును 9 శాతానికి తగ్గించామని చెప్పారు. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ వర్తిస్తుందని తెలిపారు. నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి నిర్మలా సీతారామన్... ఇక రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంపై చర్చించేందుకు జులైలో అదే అజెండాతో ప్రత్యేక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. పాన్ మసాలాపై పన్ను విధించే ప్రతిపాదనపై తదుపరి జీఎస్టీ భేటీలో చర్చిస్తామని నిర్మలా సీతారామన్ వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.