అవసరమైతే ముందు మనమే అణుబాంబు వేస్తాం... రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

Delhi : యుద్ధం వస్తే... భారత్ ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యదు అన్నది ఇప్పటివరకూ ఉన్న విధానం. అవసరమైతే ఆ రూల్ మార్చేస్తామని రాజ్‌నాథ్ ఎందుకు అంటున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 3:04 PM IST
అవసరమైతే ముందు మనమే అణుబాంబు వేస్తాం... రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
రాజ్‌నాథ్‌సింగ్
Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 3:04 PM IST
జమ్మూకాశ్మీర్ అంశంపై పాకిస్థాన్... జీహాద్ యుద్ధాన్ని ప్రకటించింది. అందుకు సన్నద్ధం కావాలని ఆ దేశ అధ్యక్షుడు, ప్రధాని, సైన్యానికి పిలుపిచ్చారు. పైగా యుద్ధం జరిగితే తీవ్ర నష్టం తప్పదనీ, అది ఎక్కడిదాకానైనా వెళ్లే ప్రమాదం ఉందని పరోక్షంగా అణ్వాయుధ యుద్ధం జరుగుతుంది అన్నట్లుగా డైలాగ్స్ పేల్చారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఈ పరిణామాలతో అలర్టైన భారత్ కూడా... అంతే ఘాటుగా తిప్పికొడుతోందా. ఇప్పటివరకూ భారత్... యుద్ధం వస్తే ముందుగా అణ్వాయుధ దాడిని చెయ్యదన్నది ఓ రూల్. అవసరమైతే ఈ విధాన్ని భవిష్యత్తులో మార్చేసే అవకాశాలుంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. పోఖ్రాన్‌‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా రాజ్‌నాథ్ ఈ వ్యాఖ్య చేశారు. పరిస్థితులను బట్టీ ఏదైనా ఉంటుందన్నారు.

ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అన్న రాజ్‌నాథ్... ఇప్పటివరకూ ఆ విధానానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని ట్వీట్ చేశారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్... ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.

బాధ్యతాయుత అణ్వాయుధ దేశంగా భారత్... ప్రతి ఒక్క భారతీయుడినీ గర్వపడేలా చేస్తోందన్న రాజ్‌నాథ్... అటల్ జీ ఆశయాల్ని నిలబెట్టడంలో ఈ దేశం ఎప్పుడూ నిబద్ధతతో ఉంటుందన్నారు.First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...