• Home
 • »
 • News
 • »
 • national
 • »
 • NO EVMS CENTRAL GOVERNMENT AND CEC SUNIL ARORA TO IMPLEMENT REMOTE VOTING FOR 2024 LOKSABHA POLLS NK

No EVMs: ఇవీఎంలకు గుడ్‌బై... 2024లో ఇంటర్నెట్ ద్వారా పోలింగ్... పూర్తి వివరాలు ఇవీ.

ఇవీఎంలకు గుడ్‌బై ? (File Image - Sunil Arora)

No EVMs: కేంద్ర ప్రభుత్వం సంచలన అడుగులు వేస్తోంది. ఈవీఎంలను పూర్తిగా పక్కన పెట్టేసి... నెట్ ద్వారా ఓటు వేసే కొత్త పద్ధతి తేబోతోంది. 2024 నుంచి ఇది అమలు కాబోతోంది.

 • Share this:
  కాలం మారుతోంది... మనమూ మారాలి... పాత పద్ధతులకు స్వస్థి పలికి... కొత్త విధానాల్ని అలవాటు చేసుకోవాలి. ఇదే విధానాన్ని పాటిస్తోంది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం. నోట్ల స్థానంలో డిజిటల్ పేమెంట్లు, టోల్ చెల్లింపుల్లో ఫాస్టాగ్ విధానం వంటివి తెచ్చిన కేంద్రం... 2024 సాధారణ ఎన్నికలకు ఈవీఎంలతో పనిలేని కొత్త విధానం తేబోతున్నట్లు తెలిసింది. దాంతో... ఇన్నాళ్లూ వాడుతున్న బ్యాలెట్ విధానం, ఈవీఎంలతో ఓటింగ్ వంటివి కాలగర్భంలో కలిసిపోనున్నాయి. వాటి స్థానంలో ఇంటర్నెట్ రాబోతోంది. నెట్ ద్వారా... ప్రజలు ఓటు వేస్తారు. 2024 లోక్ సభ ఎన్నికల నుంచి ఈ విధానం తెచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి... అక్కడ సక్సెస్ అయితే... దేశమంతా అమలు చేయనుంది. మరో 2 నెలల్లో ఇది ప్రారంభమవుతుందని తెలిసింది.

  ఇంటర్నెట్ మయం:
  ఇప్పటివరకూ మనం ఓటు వెయ్యాలంటే... సంబంధిత ఊరికి వెళ్లి... అక్కడి పోలింగ్ కేంద్రానికి వెళ్లి వెయ్యాల్సి వస్తోంది. ఈ కొత్త విధానంలో ఆ అవసరమే లేదు. దీని ద్వారా ఓటర్లు తమ ఓటును ఎక్కడి నుంచైనా వేసుకునేలా రిమోట్ ఓటింగ్ (దూరం నుంచే ఓటు వేసే) విధానం తేబోతున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. రిమోట్‌ ఓటింగ్‌ వ్యవస్థను ఐఐటీ-మద్రాస్, ఇతర ఐఐటీ టెక్నోక్రాట్లు తయారుచేస్తున్నారని వివరించారు. విధానం తయారవ్వగానే... పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఓటింగ్‌ ప్రక్రియ ఎలా ఉండాలి అన్నది పరిశీలిస్తున్నాని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పిన ఆయన.... ఇంట్లో నుంచే ఓటు వేయడం దీని ఉద్దేశం కాదన్నారు.

  estonia
  ఎస్తోనియా (image credit - google maps)


  ఎస్తోనియాలో ఇదే విధానం:
  ఆన్‌లైన్ ద్వారా ఓటు వేసే విధానాన్ని తొలిసారిగా యూరప్ దేశం ఎస్తోనియా (Estonia)లో తెచ్చారు. దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. ఇంటర్నెట్‌ ద్వారా ఓటు వేసే విధానం ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్స్‌ సహా చాలా దేశాల్లో అమల్లో ఉంది. ఐతే.. ఈ విధానంలో ఓటర్లను భయపెట్టి... ఓట్లు వేయించుకునే అవకాశం ఉండటంతో... భద్రతా కారణాల వల్ల కొన్ని దేశాలు ఈ విధానాన్ని రద్దు చేసుకున్నాయి. అలా జరగకుండా ఏం చెయ్యాలో కేంద్రం ఆలోచిస్తోంది.

  internet
  కొత్త ఇంటర్నెట్ తెస్తారా?


  కొత్త ఇంటర్నెట్:
  ఇండియాలో పోలింగ్ అంటే అది చాలా పెద్దది. 100 కోట్ల మందికి పైగానే పాల్గొనే కార్యక్రమం. అంత మంది ఓటు వేసేటప్పుడు ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ ద్వారా అయితే... హ్యాకర్లు ఎక్స్‌ట్రాలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే ప్రత్యేక ఇంటర్నెట్ లైన్స్ వేసి... హ్యాకింగ్ చేసే అవకాశమే లేకుండా చెయ్యాలనే ప్లాన్ కేంద్రం దగ్గర ఉంది. లేదంటే ప్రస్తుత పోలింగ్ కేంద్రాలకు బదులుగా ఇంటర్నెట్ పోలింగ్ కేంద్రాలు వస్తాయి. వాటిలో IP పరికరాలు, టూ వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్, ప్రత్యేక ఇంటర్నెట్ లైన్స్, బయోమెట్రిక్, వెబ్ కెమెరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చెయ్యాలనుకుంటున్నారు. మొత్తంగా ఓ కొత్త ప్రాజెక్టు వస్తుందని అనుకోవచ్చు. దాన్ని అభివృద్ధి చేసే పనిలో ఐటీ నిపుణులు ఉన్నారు.

  Video: ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ ఫుల్ హ్యాపీ:

  ఇది కూడా చదవండి: Weekly Horoscope: వారఫలాలు... మార్చి 21 నుంచి మార్చి 27 వరకు రాశిఫలాలు

  2024 ఏప్రిల్ లేదా మేలో లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఆ లోగా ఈ విధానాన్ని పూర్తిగా రెడీ చెయ్యడం సవాలుతో కూడుకున్నదే. పైగా మన దేశంలో ఎంత మంది ఇంటర్నెట్ వాడగలరు అన్న సమస్య కూడా ఉంది. ఇప్పటికీ మన దేశంలో చదువు రాని వారు కోట్లలో ఉన్నారు. ఇలాంటి ఎన్నో సవాళ్లు ఈ కొత్త విధానాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎలా ముందుకెళ్తుందో త్వరలో తెలుస్తుంది.
  Published by:Krishna Kumar N
  First published: