ఈ ఏడాది శివరాత్రి (Maha Shivratri) ఫిబ్రవరి 18న వస్తుంది. మన దేశంలో హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో శివరాత్రి కూడా ఒకటి. ఆ రోజు ఉపవాసం ఉండి.. శివాలయానికి (Shiv temple) వెళ్లి...రాత్రి జాగారం ఉంటే.. ఎంతో పుణ్యం వస్తుందని నమ్ముతారు. కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. అందులో మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఉండే దేవతలాబ్ శివాలయం (Deotalab Shiv Mandir)కూడా ఒకటి. శివరాత్రి రోజు దేవ్ తలాబ్ శివ మందిర్ భక్తులతో కిక్కిరిసిపోతుంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఐతే మన తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లోకి ఎలాంటి డ్రెస్ కోడ్ నిబంధన ఉండదు. జీన్స్ వేసుకొని కూడా వెళ్లొచ్చు. కొందరైతే సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరిస్తారు. కానీ రేవాలోని ఈ ఆలయంలో మాత్రం డ్రెస్ కోడ్ నిబంధన ఉంటుంది.
దేవతలాబ్ శివాలయంలోకి జీన్స్, టీ-షర్టు, షార్ట్ స్కర్ట్ వంటి మోడ్రన్ దుస్తులకు అనుమతి లేదు. కేవలం సంప్రదాయ దుస్తులను ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తారు. దేవతలాబ్ శివాలయాన్ని కూడా ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ తరహాలో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఐతే పురుషులు ధోనీ, పంచె, కుర్తాలు ధరిస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది. మహిళలు తప్పకుండా చీరలు ధరించాలి. అప్పుడే శివయ్య దర్శనం కలుగుతుంది. భక్తులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.
లక్ష్మీ కటాక్షం పెరగాలంటే ఈ నాణేలు మీ ఇంట్లో ఉంచండి.. డబ్బుకు లోటు ఉండదు!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ అధ్యక్షతన రేవా దేవతాలాబ్ ఆలయ నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. తప్పకుండా డ్రెస్ కోడ్ పాటించాలని స్పష్టం చేశారు. SDOP సూచనలను అనుసరించడానికి ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి లోపు ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టటం చేశారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ పురాతన ఆలయాన్ని సందర్శిస్తారు. అందువల్ల శివరాత్రి రోజు ఆలయాన్ని రంగురంగుల పుష్ఫాలు, విద్యుత్ దీపాలతో అలంకరించాలని చెప్పారు.
ఐతే ఆలయంలో డ్రెస్ కోడ్ నిబంధన విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Madhya pradesh