Home /News /national /

NO BAN GOVT REGULATING CRYPTOCURRENCY TO CHECK ROLE IN HAWALA TERROR FUNDING SAYS SOURCES SK GH

Cryptocurrency: క్రిప్టో కరెన్సీపై నిషేధం లేదు.. మరి కేంద్రం తీసుకురాబోతున్న చట్టం లక్ష్యమేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Crypto Currency: క్రిప్టోలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించట్లేదని విశ్వసనీయ వర్గాలు CNN-News18కు చెప్పాయి. వీటిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో నియంత్రణ కోరుతోందని ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది.

క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బిల్లులో ఏముంటుందోనని క్రిప్టో మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ధరలు ఒక నెలలో కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రభుత్వ బిల్లు పరిణామాలపై మార్కెట్లు, నిపుణులు విశ్లేషణలు ప్రారంభించిన క్రమంలో.. క్రిప్టోలను ప్రభుత్వం పూర్తిగా నిషేధించట్లేదని విశ్వసనీయ వర్గాలు CNN-News18కు చెప్పాయి. వీటిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో నియంత్రణ కోరుతోందని ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది. “క్రిప్టో దుర్వినియోగం కాకుండా ఉండేలా రెగ్యులేషన్ మెకానిజం అమలులో ఉంటుంది. క్రిప్టోకరెన్సీ అండర్‌గ్రౌండ్ లావాదేవీల గురించి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా వీటిద్వారా హవాలా మార్గంతో పాటు ఉగ్రవాదులకు నిధులు అందుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీటిని నియంత్రించాలని భావిస్తోంది” అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోని కరెన్సీ, పన్నుల వ్యవస్థకు క్రిప్టో కరెన్సీ ప్రమాదకరం కాబట్టి, దీన్ని లీగల్ టెండర్‌గా గుర్తించలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు చట్టవిరుద్ధమైన లేదా దేశ వ్యతిరేక పనికి ఉపయోగించే క్రిప్టోకరెన్సీ మూలాన్ని గుర్తించగలిగేలా కఠినమైన యంత్రాంగం అమలులో ఉంటుందని వెల్లడించాయి.

Crypto currencies: ఆ క్రిప్టో కరెన్సీలు మనుగడలో ఉండవా? రఘురామ్ రాజన్ ఏం చెబుతున్నారంటే..

* ప్రధాని నిర్ణయం ఏంటి?
క్రిప్టో మార్కెట్లు మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా మారే ప్రమాదాలను తొలగించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. "ఈ నెల ప్రారంభంలో ఈ అంశంపై ప్రధానమంత్రి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం క్రిప్టోలపై తీసుకునే చర్యలపై అప్పుడే ఏకాభిప్రాయం కుదిరింది. క్రమబద్ధీకరించని క్రిప్టో మార్కెట్లు.. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా మారకుండా చూడాలని సమావేశంలో చర్చించారు." అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టనున్న 26 బిల్లులలో ‘క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ బిల్లు- 2021’ ఒకటని లోక్‌సభ వెబ్‌సైట్ ధ్రువీకరించింది.

Gold Rates: పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇదే

* ప్యానెల్ సూచనలతోనే బిల్లు
ఇటీవల BJP నాయకుడు జయంత్ సిన్హా అధ్యక్షతన ఒక పార్లమెంటరీ ప్యానెల్ ఏర్పాటైంది. వివిధ స్టేక్‌హోల్డర్స్‌తో క్రిప్టో ఫైనాన్స్ లాభనష్టాలను ప్యానెల్ చర్చించింది. డిజిటల్ కరెన్సీలను నిషేధించలేం కానీ తప్పనిసరిగా వీటిని నియంత్రించాలని ఈ ప్యానెల్ గుర్తించింది. అనంతరం దీనిపై సంబంధిత బిల్లు రూపొందింది. ఈ బిల్లు భారతదేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని కోరుతోంది. అయితే అంతర్లీన సాంకేతికతను, క్రిప్టో ఉపయోగాలను ప్రోత్సహించడానికి బిల్లులో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆర్‌బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని రూపొందించడానికి సులభతరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడం కూడా ఈ బిల్లు లక్ష్యం.

Cryptocurrency: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం, పకడ్బందీగా బిల్లు

* భారీగా పతనం
క్రిప్టో బిల్లుపై వార్తల నేపథ్యంలో.. బుధవారం నాటికి అన్ని ప్రధాన డిజిటల్ కరెన్సీలు దాదాపు 15 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. బిట్‌కాయిన్ సుమారు 18.53 శాతం, ఎథేరియం (Ethereum) 15.58 శాతం, టెథర్ (Tether) 18.29 శాతం పడిపోయాయి. క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని అందించే న్యూయార్క్ బేస్డ్ న్యూస్ సైట్ కాయిన్‌డెస్క్ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. మంగళవారం సాయంత్రం బిట్‌కాయిన్ విలువ $55,460.96కి క్షీణించింది. నవంబర్‌లో చేరుకున్న ఆల్-టైమ్ గరిష్ట స్థాయి విలువ అయిన $69,000 నుంచి ఏకంగా 20 శాతం క్షీణించింది.

Bitcoin City: ఆ సిటీలో టాక్స్ లు ఉండవు, బ్యాంకులతో పనిలేదు..వచ్చేస్తోంది Bitcoin City

ఇటీవల క్రిప్టోకరెన్సీలపై భారతదేశం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనిపై అధికారిక నిబంధనలు లేకపోవడంతో క్రిప్టో పెట్టుబడులు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. అయితే ప్రభుత్వం డిజిటల్ కరెన్సీ రంగాన్ని నియంత్రించడానికి చట్టాలను తీసుకురావాలని నిర్ణయించింది. క్రిప్టోకరెన్సీలు తప్పుడు వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి వెళ్లి మన యువతను పాడుచేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ఒక సందర్భంలో చెప్పారు. ఈ విషయంపై ప్రజాస్వామ్య దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలని, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరారు. క్రిప్టోకరెన్సీని పూర్తిగా నిషేధించడం కంటే మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌ను నివారించడానికి బలమైన నియంత్రణ అవసరమని ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. అయితే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన తరువాతే క్రిప్టో నియంత్రణకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Bitcoin, Cryptocurrency

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు