హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తెరపైకి యూనిఫామ్ సివిల్ కోడ్‌.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెరపైకి యూనిఫామ్ సివిల్ కోడ్‌.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మరోసారి యూనిఫామ్ సివిల్ కోడ్ అంశం తెరపైకి వచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్‌కు అనుకూలంగా కొన్ని అనుకూల అంశాలు ఉన్నప్పటికీ, రాజ్యాంగ రూపకర్తలు ఆ దిశగా తీవ్రమైన ప్రయత్నాలు చేయలేదని అభిప్రాయపడింది. దీనికి సంబంధించి గోవాను ఉదాహరణగా పేర్కొంది. గోవాకు చెందిన ఓ వ్యక్తి గోవా బయట నివసిస్తుంటే, అతడికి చెందిన ఆస్తులపై హక్కులు పోర్చుగల్ చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలా? లేకపోతే భారత చట్టాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలా? అనే మీమాంశ ఉంది. (గతంలో గోవా పోర్చుగల్ కాలనీగా ఉండేది కాబట్టి).

దేశంలో విడాకులకు సంబంధించి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు వేర్వురు చట్టాలు ఉన్నాయి. హిందూ వివాహ చట్టం ప్రకారం, హిందూ జంటలు వివాహం చేసుకున్న 12 నెలల తర్వాత పరస్పర అంగీకారంతో విడాకుల పిటిషన్ దాఖలు చేయవచ్చు. భర్తకు ఎయిడ్స్ వంటి నయం చేయలేని వ్యాధులు ఉంటే లేదా లైంగిక పటుత్వం లేకపోతే, వివాహం అయిన వెంటనే విడాకుల దరఖాస్తును దాఖలు చేయవచ్చు. క్రైస్తవ జంటలు వివాహం చేసుకున్న 2 సంవత్సరాల తరువాత విడాకుల కోసం దాఖలు చేయవచ్చు, అంతకు ముందు వీలు కాదు.

ముస్లిం వివాహచట్టంలో గతంలో ట్రిపుల్ తలాక్ ఉండేది. వివాహం సమయంలో మెహర్ మొత్తం నిర్ణయించబడుతుంది. విడాకుల తరువాత, ఒక ముస్లిం పురుషుడు వెంటనే వివాహం చేసుకోవచ్చు, కాని స్త్రీ 4 నెలలు 10 రోజులు వేచి ఉండాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవులకు భిన్నమైన వ్యక్తిగత చట్టం ఉంది. దీన్ని మార్చి అందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది.

First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు