Fact Check: స్కూల్ ఫీజుల కోసం రూ.11,000 ఇస్తున్న కేంద్రం?

scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిభకలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ లభిస్తాయి.

news18-telugu
Updated: September 23, 2020, 10:32 PM IST
Fact Check: స్కూల్ ఫీజుల కోసం రూ.11,000 ఇస్తున్న కేంద్రం?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశంలో ఎన్నో లక్షల మంది తమ పిల్లలకు స్కూళ్లు, కాలేజీ ఫీజులు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అలాంటి వారందరి కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.11,000 ఇస్తోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తకు సంబంధించి కేంద్ర సమాచార ప్రసార శాఖ వివరణ ఇచ్చింది. అలాంటి ప్రకటన ఏదీ కేంద్ర ప్రభుత్వం చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ‘ఓ వెబ్ సైట్‌లో స్కూలు, కాలేజీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఫీజులు కట్టేందుకు రూ.11,000 చెల్లిస్తుందని రాసింది. కానీ, అది ఫేక్ వెబ్ సైట్. ఫేక్ న్యూస్.’ అని పీఐబీ ఓ ట్వీట్‌లో స్పష్టం చేసింది.



బాగా చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ కావాలంటే నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే ప్రతిభకలిగిన విద్యార్థులకు స్కాలర్ షిప్స్ లభిస్తాయి. అది కూడా సమగ్రమైన, సరైన సమాచారం పొందుపరచాలి. ఆ వివరాలన్నీ ధ్రువీకరించిన తర్వాత వారికి స్కాలర్‌షిప్స్ వస్తాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 23, 2020, 10:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading