దేశ వ్యాప్తంగా రీజిన్ సెంటర్ గుర్తింపు పొందేదుకు పలు వైద్య కళాశాలు (Medical Colleges) దరఖాస్తు చేసుకొన్నాయి. ఈ గుర్తింపునుకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) తాజాగా మార్గ దర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే వైద్య కళాశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 12, 2021 పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రాంతీయ కేంద్రం యొక్క గుర్తింపు పొందడానికి ఆవశ్యకతల గురించి నోటిఫికేషన్లో పేర్కొంది. NMC మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీస్ (Medical Education Technologies) కోసం ప్రాంతీయ కేంద్రంగా గుర్తింపు పొందేందుకు వైద్య కళాశాలకు ఉండాల్సి అర్హతలపై ఓ జాబితాను సిద్ధం చేసింది. ప్రాంతీయ కేంద్రాలుగా గుర్తింపు పొందాలనుకునే వైద్య కళాశాలలు నవంబర్ 30లోగా తమ దరఖాస్తు ఫారమ్‌ను యూజీఎంఈబీ, ఎన్ఎంసీకి పంపాల్సి ఉంటుందని ఎన్ఎంసీ పేర్కొంది.
గైడ్‌లైన్స్ ఇవే..
- వైద్య కళాశాల అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ బోధనతో కనీసం 10 సంవత్సరాల పాటు ఉండాలి.
BEL Recruitment 2021: "బెల్"లో ఉద్యోగాలు.. జీతం రూ.లక్షపైనే.. అర్హతలు, దరఖాస్తు విధానం
- వైద్య కళాశాల తప్పనిసరిగా కనీసం 10 సంవత్సరాల పాటు ఫంక్షనల్ మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌ను కలిగి ఉండాలి.
- దాని అధ్యాపకుల కోసం సవరించిన ప్రాథమిక కోర్సు వర్క్‌షాప్ శిక్షణను నిర్వహించినట్లు డాక్యుమెంటరీ సాక్ష్యాధారాలతో నిలబడాలి.
- MET కోసం ప్రాంతీయ కేంద్రంగా గుర్తింపు పొందేటప్పుడు విద్యా పరిశోధన స్కాలర్షిప్లు, పత్రికలలోని ప్రచురణలు పరిగణించబడతాయి.
- వైద్య విద్యలో పీహెచ్డీ, ఎంఫిల్‌తో కూడిన అధ్యాపకులు ఉన్న కళాశాలలను ప్రాంతీయ కేంద్రాలుగా గుర్తించి వెయిటేజీ ఇస్తారు.
- అధ్యాపకులకు తప్పనిసరిగా ఫంక్షనల్ స్కిల్ ల్యాబ్‌లు, క్లినికల్, సిమ్యులేషన్ మరియు కమ్యూనికేషన్ స్కిల్ ల్యాబ్‌లు ఉండాలి.
- ప్రాంతీయ కేంద్రంలోని వైద్య విద్య విభాగానికి సంబంధించిన సిబ్బంది కోసం డీన్ లేదా ప్రిన్సిపాల్ లేదా వైస్-ఛాన్సలర్, కన్వీనర్, రిసోర్స్ ఫ్యాకల్టీ, ప్యూన్ వంటి సహాయక సిబ్బంది ఉండాలి.
మౌలిక వసతులకు పెద్దపీట..
మౌలిక సదుపాయాల పరంగా, ప్రాంతీయ కేంద్రం తప్పనిసరిగా తగిన ఎయిర్ కండిషన్డ్ ప్రాంతాన్ని కలిగి ఉండాలి. ఇది తప్పనిసరిగా బ్లాక్‌బోర్డ్ /వైట్‌బోర్డ్/మల్టీమీడియా బోర్డ్, ఆడియో/వీడియో సహాయాలు, సరైన సౌండ్ రికార్డింగ్ సిస్టమ్, నిరంతర విద్యుత్ సరఫరా ద్వారా బ్యాకప్ చేయబడాలి. ఇందులో దాదాపు 30 మంది పాల్గొనేలా ఉండాలి. ప్రాంతీయ కేంద్రాలుగా గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే వైద్య కళాశాలలు తప్పనిసరిగా చిన్న/పెద్ద బృంద చర్చలు నిర్వహించడానికి సౌకర్యాలను కలిగి ఉండాలి. వసుతలతో కూడిన క్యాంపస్ కచ్చితంగా కలిగి ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Medical college, Medical colleges