HOME » NEWS » national » NIVAR CYCLONE EFFECT ON TAMILNADU SEVEN DISTRICTS COMPLETELY CLOSED AK

Nivar Cyclone: తమిళనాడును వణికిస్తున్న నివర్ తుపాను.. ఆ జిల్లాల్లో అన్నీ బంద్

Nivar Cyclone: తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

news18-telugu
Updated: November 25, 2020, 7:21 AM IST
Nivar Cyclone: తమిళనాడును వణికిస్తున్న నివర్ తుపాను.. ఆ జిల్లాల్లో అన్నీ బంద్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడును నివర్ తుపాను వణికిస్తోంది. అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన నివర్ తుపాను.. తీరం వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. మరోవైపు నివర్ ప్రభావంతో తమిళనాడులో ఇప్పటికే అనేక జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు.

తమిళనాడులోని ఏడు జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా అన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. అతి తీవ్ర తుపాను కారైక్కాల్, మామల్లపురం మధ్య తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. తీరం దాటే సమయంలో కడలూరు, విల్లుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఇక తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఇప్పటికే మాట్లాడారు. అవసరమైన మేర సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

ఇక తెలుగు రాష్ట్రాలపై కూడా నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. నేటి నుంచి 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. నెల్లూరు జిల్లాకు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నివర్ తుపానుపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Published by: Kishore Akkaladevi
First published: November 25, 2020, 7:21 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading