హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

లోక్ సభ ఎన్నికలలో నితీష్ అక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఆఫర్ ప్రకటించిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్..

లోక్ సభ ఎన్నికలలో నితీష్ అక్కడి నుంచి పోటీ చేస్తారు.. ఆఫర్ ప్రకటించిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్..

బీహార్ సీఎం నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ (ఫైల్)

బీహార్ సీఎం నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్ (ఫైల్)

Bihar:  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా ఆయన చేసిన కామెంట్ లు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

కొద్ది రోజులుగా బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish kumar) తన పర్యటనలతో రాజకీయావర్గాలలో చర్చకు కేంద్ర బిందువుగా మారారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ సీఎం తో పాటు, అనేక మంది అపోసిషన్ నాయకులను కూడా కలుసుకున్నారు. వచ్చే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని, మోదీని అధికారంలో నుంచి దించేదిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన తాను.. పలు సందర్బాలలో పీఎంగా తాను పోటీచేయబోనని తెలిపారు. కేవలం 2024 ఎన్నికలలో మోదీకి వ్యతిరేకంగా, అపోసిషన్ పార్టీలను కూడగట్టటమే తాను చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పూర్తి వివరాలు.. ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్,( Akhilesh yadav)  బీహార్ సీఎం నితీష్ కుమార్ కు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలలో.. యూపీ లో తనకు నచ్చిన ఏదైనా స్థానం నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని, అంతే కాకుండా.. తన పార్టీ మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని వార్తలు తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఫుల్‌పూర్‌లోని జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన పలువురు కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నితీష్‌కుమార్‌ను ఇదివరకే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

జనతాదళ్ (యునైటెడ్) జాతీయ అధ్యక్షుడు లాలన్ సింగ్ ఆదివారం కూడా నితీష్ కుమార్ ఉత్తరప్రదేశ్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అన్నారు. ఫుల్‌పూర్ నుండి మాత్రమే కాకుండా అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ లోక్‌సభ స్థానాల నుండి కూడా పోటీ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది సరైన సమయంలో మాత్రమే నిర్ణయించబడుతుందని జెఎన్ యూ నేతలు పేర్కొన్నారు. అయితే నితీష్ కుమార్‌కు అంబేద్కర్ నగర్, మీర్జాపూర్ నుండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఆయన లక్ష్యం ఫలితంగానే ఆయన ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్నందున 2024 ఎన్నికలకు ఎన్నికలపరంగా కీలకమైన రాష్ట్రమని లాలన్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ నుంచి బీజేపీకి 65 మంది ఎంపీలు ఉన్నారని, అఖిలేష్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు కలిస్తే కాషాయ పార్టీ 15-20 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత చాలా ముఖ్యమైన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇదే జరిగితే బీజేపీకి 15-20 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.

అలహాబాద్‌లోని ఫుల్‌పూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానం అయిన వారణాసికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ స్థానం నుంచి నితీష్‌కుమార్ పోటీ చేయాలని నిర్ణయించుకుంటే, 2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ డైనమిక్స్ మారవచ్చు. 2024లో నరేంద్ర మోదీకి సవాల్‌ రావాలంటే ఉత్తరప్రదేశ్‌లో భారీ విజయం సాధించాలని నితీష్‌ కుమార్‌కు తెలుసునని, అది లేకుండా తన లక్ష్యంలో విఫలమవుతుందని నితీశ్‌ కుమార్‌కు తెలుసునని వర్గాలు చెబుతున్నాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Akhilesh Yadav, Bihar, Bjp, Elections, Nitish Kumar

ఉత్తమ కథలు