• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • NITIN GADKARI WAITING FOR HUNG LOK SABHA SENA LEADERS LOADED REMA

ఎన్నికల్లో హంగ్ రావాలని గడ్కరీ కోరుకుంటున్నారు : శివసేన ఎంపీ

ఎన్నికల్లో హంగ్ రావాలని గడ్కరీ కోరుకుంటున్నారు : శివసేన ఎంపీ

నితిన్ గడ్కరీ, సంజయ్ రౌత్(File)

2014లో మోదీ హవా బలంగా వీచి ఓటర్లంతా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని, కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. రాహుల్ మోదీ స్థాయి నేత కాకపోయినా.. ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో రాహుల్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా మోదీ ప్రభ తగ్గుతోందా?.. మోదీని కాదని 2019ఎన్నికల కోసం మరొకరిని తెర పైకి తీసుకొచ్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందా?.. ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ బీజేపీ రాజకీయాలపై ఇలాంటి హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీకి ప్రత్యామ్నాయంగా నితిన్ గడ్కరీని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

    రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హంగ్ రావాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కోరుకుంటున్నారని రౌత్ అన్నారు.శివసేన అధికారిక పత్రిక 'సామ్నా'కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఉన్న రౌత్.. అందులో ఆదివారం ఓ వ్యాసం రాశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభ తగ్గుతుంటే.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభ పెరుగుతోందన్నారు. 2014లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మోదీ సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. 2014లో మోదీ హవా బలంగా వీచి ఓటర్లంతా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారని, కానీ ఇప్పుడా పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. రాహుల్ మోదీ స్థాయి నేత కాకపోయినా.. ప్రస్తుత ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో రాహుల్ ప్రాధాన్యం పెరుగుతోందన్నారు.

    నితిన్ గడ్కరీ రెండోసారి బీజేపీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు కొన్ని రాజకీయ కుట్రలు జరిగాయి. రాబోయే ఎన్నికల విషయంలో బీజేపీ సీనియర్ నేతలంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. ఇటీవలి మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత నితిన్ గడ్కరీ చేసిన కామెంట్స్ కూడా దుమారం రేపాయి. గడ్కరీ పట్ల ఆర్ఎస్ఎస్‌కు, బీజేపీ నాయకులకు పూర్తి స్థాయి సానుకూలత ఉండటం గమనించాల్సిన విషయం.
    సంజయ్ రౌత్, శివసేన ఎంపీ



    First published:

    అగ్ర కథనాలు