ఇక అన్నీ మట్టి పాత్రలే... రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు...

Indian Railways : ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు పెద్ద యుద్ధం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం... ఆ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 28, 2019, 7:21 AM IST
ఇక అన్నీ మట్టి పాత్రలే... రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు...
నితిన్ గడ్కరీ
  • Share this:
కేంద్ర రవాణా, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ... అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకూ లేఖలు పంపారు. ఆయన నుంచీ కొత్తగా ఏ ఆదేశాలు వచ్చాయా అని చూసిన రాష్ట్ర ప్రభుత్వాలకు ప్లాస్టిక్ నియంత్రణా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై రైల్వే స్టేషన్లు, బస్ట్‌స్టాప్‌లలో అన్ని షాపుల్లో తినుబండారాలకు ఉపయోగించే ప్లాస్టిక్ కప్పుల బదులు మట్టి పాత్రలు, కుండలు వాడాలని లేఖలో కోరారు గడ్కరీ. ఈ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. మట్టి కుండలు, మట్టి వస్తువులూ వాడి... వాటిని తయారుచేసే... కుమ్మరి వర్గాల జీవితాల్లో వెలుగు నింపండి అని కోరారు గడ్కరీ. ఐతే... ఇదివరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ కూడా రైల్వేస్టేషన్లలో మట్టి కుండల్లోనే మజ్జిగ తాగాలని ఆదేశించారు. అప్పట్లో అది అమలైంది కూడా.

తాజా ఆదేశాల ప్రకారం ఇకపై రైల్వేస్టేషన్లు, బస్టాప్‌ల దగ్గర ఉండే హోటళ్లు, ఇతర షాపుల్లో పేపర్ ప్లేట్లు, పేపర్ కప్పుల బదులు... మట్టి పాత్రలు, కుండల్ని ఉపయోగించాల్సిందే. ఇది పక్కాగా అమలయ్యేందుకు... రైల్వే శాఖ మంత్రికి కూడా లేఖ పంపారు గడ్కరీ. దేశంలోని అన్ని రవాణా శాఖల మంత్రులకూ లేఖలు వెళ్లాయి. ఈ సందర్భంగా... తాను రోజూ నిద్ర లేవగానే... మట్టి కుండలో నీటినే తాగుతానని తెలిపారు. ఆ నీరు సహజత్వంతో, స్వచ్ఛమైనదిగా ఉంటుందని అన్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని వివరించారు.

ప్రస్తుతం రెండు స్టేషన్లలో మట్టి కుండల వాడకం అమల్లో ఉంది. అన్ని స్టేషన్లు, బస్టాండ్లలో మట్టి పాత్రలు వాడితే... దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది కుమ్మరి వర్గాల వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాక... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రధాని మోదీ కోరుతున్న ప్లాస్టిక్ రహిత భారత్ సాధ్యమవుతుంది.

First published: August 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>