ఫైన్ కంటే ప్రాణాలు ముఖ్యం కాదా?...ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర మంత్రి గడ్కారీ

ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ..జరిమానాల కంటే ప్రాణాలు ముఖ్యంకాదా? అని ప్రశ్నించారు. 

news18-telugu
Updated: September 11, 2019, 4:53 PM IST
ఫైన్ కంటే ప్రాణాలు ముఖ్యం కాదా?...ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర మంత్రి గడ్కారీ
నితిన్ గడ్కరీ
  • Share this:
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీ జరిమానా విధిస్తూ చట్ట సవరణ చేపట్టడాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ సమర్థించుకున్నారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై జరిమానాను పెంచినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ జలాన్లను ఆదాయ వనరుగా కేంద్ర ప్రభుత్వం పరిగణించడం లేదని స్పష్టంచేశారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై విధించే జరిమానాను గణనీయంగా పెంచడం తెలిసిందే. ఈ నెల 1 నుంచి ఈ పెంచిన జరిమానా అమలులోకి వచ్చింది. దీన్ని ఖండిస్తూ పలువురు వాహనదారులు తమ నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడ్కారీ స్పందిస్తూ...రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య దేశంలో అత్యధికంగా ఉన్నట్లు వివరించారు.

కొన్ని రాష్ట్రాలు ఈ జరిమానా మొత్తాన్ని తగ్గిస్తుండడంపై స్పందించిన గడ్కారీ...మోటారు వాహనాల చట్ట సవరణలను కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్రాలు తమ నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.  ప్రజల ప్రాణాలను కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న గడ్కారీ..జరిమానాల కంటే ప్రాణాలు ముఖ్యంకాదా? అని ప్రశ్నించారు. అయితే ట్రాఫిక్ నిబంధనలను సక్రమంగా ఫాలో అయితే జరిమానాలు కట్టాల్సిన అవసరం లేదుకదా? అన్నారు. ట్రాఫిక్ చనాన్లపై మీడియా రిపోర్టింగ్‌లను అభినందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

చాలా మంది ఇప్పుడే డ్రైవింగ్ లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకుంటున్నారని గడ్కారీ పేర్కొన్నారు. పెరిగిన జరిమానాల కారణంగా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, తద్వారా ప్రాణ నష్టం కూడా తగ్గుతందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా ఇదేనని వ్యాఖ్యానించారు.

 

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>