హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Breaking News: నితిన్ గడ్కరీకి అస్వస్థత..స్టేజిపై పడిపోయిన కేంద్రమంత్రి

Breaking News: నితిన్ గడ్కరీకి అస్వస్థత..స్టేజిపై పడిపోయిన కేంద్రమంత్రి

PC: Twitter

PC: Twitter

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. బెంగళూరు సిలిగురిలోని ఓ సభలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గడంతో కుర్చీ నుండి లేస్తున్న క్రమంలో కిందపడబోయారు. ఈ క్రమంలో పక్కనే వున్న సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. గడ్కరీ ఆరోగ్య వివరాలను ప్రధాని మోదీ వైద్యులతో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. బెంగళూరు సిలిగురిలోని ఓ సభలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఒంట్లో షుగర్ లెవల్స్ తగ్గడంతో కుర్చీ నుండి లేస్తున్న క్రమంలో కిందపడబోయారు. ఈ క్రమంలో పక్కనే వున్న సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తుంది. గడ్కరీ ఆరోగ్య వివరాలను ప్రధాని మోదీ వైద్యులతో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు.

Astrology: రాబోయే రెండు వారాలు ఈ 3 రాశుల వారికి ఎంతో ప్రత్యేకం.. ఎందుకంటే..

Live from Inauguration & Foundation Stone Laying Ceremony of 3 NH Projects worth Rs.1206 Crore in Siliguri, West Bengal. #PragatiKaHighway #GatiShakti https://t.co/GYnfQZWg16

— Nitin Gadkari (@nitin_gadkari) November 17, 2022

కాగా సిలిగురిలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కోసం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గడ్కరీ హాజరయ్యారు. అయితే వేదికపై కూర్చున్న గడ్కరీ కొంత అసౌకర్యంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కుర్చీలో నుండి లేస్తుండగా పడిపోయేటట్లు కనిపించారు. దీనితో అప్రమత్తమైన సిబ్బంది ఆయనను పట్టుకున్నారు. ఏమైందో అని కంగారు పడ్డ సిబ్బంది గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి మరి వైద్యుడిని తీసుకొచ్చారు. పరీక్షలు చేసిన వైద్యుడు షుగర్ లెవల్స్ పడిపోయాయని చెప్పారు.  అనంతరంసభా వేదిక నుంచి ఓ రూమ్ కు గడ్కరీని తీసుకెళ్లారు. అయితే అక్కడ కూడా ఆయన అసౌకర్యంగా కనిపించాడు. అయితే బీజేపీ నాయకుడు రాజు బిస్తా గడ్కరీని తన ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఆయనకు చికిత్స అందుతున్నట్లు తెలుస్తుంది.

Twitter: పరాగ్ అగర్వాల్, నెడ్ సెగల్‌ను తిరిగి ఆహ్వానించిన ట్విటర్..? అసలు విషయం ఏంటంటే..

Inaugurated and laid the foundation stone of 3 NH projects worth Rs. 1206 Crore in Siliguri today in the presence of MPs Shri @RajuBistaBJP Ji, Shri @JayantaRoyJPG Ji and Central & State Officials.#PragatiKaHighway #GatiShakti pic.twitter.com/E30PAaxNUf

— Nitin Gadkari (@nitin_gadkari) November 17, 2022

ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం ఆరా..

ఈ విషయం తెలిసిన ప్రధాని మోడీ నితిన్ గడ్కరీ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని ఆరోగ్యం మెరుగుపడుతుందని దైర్యం చెప్పారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పోలీసు కమీషనర్ ను ఆదేశించారు. ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

First published:

Tags: Bjp, India, Nitin Gadkari

ఉత్తమ కథలు