సొమ్మసిల్లిన నితిన్ గడ్కారీ... నిలకడగా ఆరోగ్య పరిస్థితి...

మహ్మదా పూలే కృషి విద్యాపీఠ్ అగ్నికల్చరల్ యూనివర్సిటీ సభా వేదిక మీద ఉన్నట్టుండి పడిపోయిన కేంద్ర మంత్రి... లో షుగర్ కారణంగా కళ్లు తిరిగాయని ప్రకటించిన వైద్యులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 7, 2018, 3:57 PM IST
సొమ్మసిల్లిన నితిన్ గడ్కారీ... నిలకడగా ఆరోగ్య పరిస్థితి...
సొమ్మసిల్లి పడిపోయిన నితిన్ గడ్కారీ..
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: December 7, 2018, 3:57 PM IST
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ అస్వస్థతకు గురయ్యాయరు. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌ రాహురిలోని మహ్మదా పూలే కృషి విద్యాపీఠ్ అగ్నికల్చరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఓ సభకు హాజరైన నితిన్ గడ్కారీ... అందరూ చూస్తుండగా స్టేజి మీద సొమ్మసిల్లి పడిపోయారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నిల్చొన్న నితిన్ గడ్కారీ... కళ్లు తేలేస్తూ ఒరిగిపోవడం అంతా వీడియోల్లో రికార్డైంది. నితిన్ గడ్కారీ పక్కనే ఉన్న మహారాష్ట్ర గవర్నర్ సీవీ రావు, ఇంకొంత నాయకులు నితిన్ గడ్కారీ పడిపోకుండా వెంటనే స్పందించి పట్టుకున్నారు. నితిన్ గడ్కారీ ఉన్నట్టుండి అస్వస్థతకు గురవ్వడంతో అక్కడున్న ఆయన అనుచరులు, అభిమానులు, కాలేజీ విద్యార్థులు అంతా ఆందోళనకు గురయ్యారు. ఆయన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే నిత్కిన్ గడ్కారీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీజేపీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

సభ జరిగిన ప్రాంతంలో వాతావరణం వేడిగా ఉండడం... షుగర్ కారణంగా నితిన్ గడ్కారీ సొమ్మసిల్లినట్టు తెలిపారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత తేరుకున్న నితిన్ గడ్కారీ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘లో షుగర్ కారణంగా ఆరోగ్యం కాస్త దెబ్బతింది. వైద్యులను సంప్రదించిన తర్వాత నా ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందిన అందరికీ కృతజ్ఞతలు...’ అంటూ ట్వీట్ చేశాడు నితిన్ గడ్కారీ.

నితిన్ గడ్కారీ పడిపోయిన వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...
Loading...
First published: December 7, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...