నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...

Niti Aayog Meet : ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ఐదోసారి సమావేశానికి ఐదు అంశాల అజెండాను రూపొందించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 6:20 AM IST
నేడు నీతి ఆయోగ్ సమావేశం... చర్చించే కీలక అంశాలు ఇవీ...
నీతి ఆయోగ్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: June 15, 2019, 6:20 AM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్టప్రతి భవన్‌లో నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. దీనికి అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర రక్షణ, ఆర్థిక, హోం, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రులు తదితరులు హాజరవుతారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారమే ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ భేటీకి వెళ్లట్లేదని తెలిసింది. ఈ నెల 21న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఉండటంతో... కేసీఆర్ ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే ఆయన ఢిల్లీ సమావేశానికి వెళ్లట్లేదా అన్న అంశంపై టీఆర్ఎస్ వర్గాలు కచ్చితమైన సమాధానం ఇవ్వట్లేదు.

నేటి సమావేశంలో దేశంలో ఉన్న కరవు పరిస్థితులు, వాటిని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలనే అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఆలాగే... రోడ్లు, భవనాలు, చిన్న, మధ్య పరిశ్రమలు, సామాజిక న్యాయం, సాధికారిత, రైల్వే, వాణిజ్యం, పరిశ్రమలు, ప్రణాళికా కార్యక్రమాలు అమలుపై సమీక్షిస్తారు. వర్షం నీటిని ఆదా చెయ్యడం, జిల్లాల అభివృద్ధి, సాధించిన ప్రగతి, ముందున్న సవాళ్లు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీల బలోపేతం, నిత్యవసరాల వస్తువుల చట్టం, నక్సలైట్ల సమస్య, భద్రతా వ్యవహారాలు వంటి అంశాలపై చర్చించబోతున్నారు.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశాన్ని బహిష్కరించారు. నీతి ఆయోగ్ ఎందుకూ పనికి రాదన్న ఆమె... కేంద్రం పెత్తనమే తప్ప, రాష్ట్రాలకు విలువ లేదన్నారు. మొదటి నీతి ఆయోగ్ సమావేశం 2015 ఫిబ్రవరి 8న జరిగింది. నాలుగో సమావేశం 2018 జూన్ 17న జరిగింది. నేటి భేటీలో ఖరీఫ్ సాగు, ఇతర అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టబోతున్నారు.

 ఇవి కూడా చదవండి :

Gyro Drop : అది ఫేక్ వీడియో... భలే నమ్మిస్తున్నారుగా...

రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇవీ ప్రయోజనాలు...

Loading...

టమాటాలతో 10 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే కచ్చితంగా తింటారు...

First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...