హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Niti Aayog Updates నీతి ఆయోగ్ భేటీలో PM Modi నిర్దేశం.. కేసీఆర్, నితీశ్ తప్ప సీఎంలంతా హాజరు..

Niti Aayog Updates నీతి ఆయోగ్ భేటీలో PM Modi నిర్దేశం.. కేసీఆర్, నితీశ్ తప్ప సీఎంలంతా హాజరు..

నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ

నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ

దేశ గమనాన్ని నిర్దేశించే థింక్ టాక్ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైంది. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ హాలులో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 7వ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi Cantonment, India

భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాలు జరుపుకొంటున్న వేళ దేశ గమనాన్ని నిర్దేశించే థింక్ టాక్ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైంది. ఆదివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ హాలులో జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 7వ సమావేశానికి (NITI Aayog's Governing Council meeting)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షత వహించారు. ఇద్దరు తప్ప దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు.

పంటల వైవిధ్యం, పట్టణ పరిపాలన, జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలు వంటి వివిధ అంశాలపై నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. సీఎంలకు కీలక నిర్దేశం చేశారు. నీతి ఆయోగ్ అపెక్స్ బాడీ అయిన గవర్నింగ్ కౌన్సిల్‌లో అందరు ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్‌కు ప్రధానమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జూలై 2019 తర్వాత నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భౌతికంగా భేటీ కావడం ఇదే తొలిసారి.

CM KCR | NITI Aayog : కేసీఆర్‌ ఆరోపణలు పచ్చి తప్పులు : నీతి ఆయోగ్ దిమ్మతిరిగే కౌంటర్..


నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాలతోపాటు విపక్ష పార్టీల సీఎంలు సైతం హాజరయ్యారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, కాంగ్రెస్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీలో పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పుల పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాలలో భారత్ ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలపై చర్చ జరిగింది.

ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..


నీతి ఆయోగ్ నిర్ధక సంస్థలా మారిందని, దాని పాలక మండలి మోదీ భజన మండలిగా మారిందని ఆరోపిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశాన్ని బహిష్కరించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నీతి ఆయోగ్ పనికిమాలిన వ్యవస్థలా మారిందని, అదిచ్చిన సిఫార్సులను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందని కేసీఆర్ చేసిన ఆరోపణలకు సంస్థ ఘాటుగా బదులిచ్చింది. కేసీఆర్ సమావేశానికి రాకపోవడం దురదృష్టకరం అంటూనే, తెలంగాణ సీఎం ఆరోపణలు అవాస్తవాలంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చింది. మరోవైపు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా నీతి ఆయోగ్ భేటీకి రాలేదు. కొవిడ్ వ్యాధి నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన ఆరోగ్య కారణాల రీత్యా హాజరుకాలేదని తెలుస్తోంది.

First published:

Tags: Azadi Ka Amrit Mahotsav, CM KCR, Delhi, Niti Aayog, Nitish Kumar, Pm modi

ఉత్తమ కథలు