హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

NITI Aayog: లాభాపేక్ష లేని వైద్యశాలలకు ప్రోత్సాహకాలు.. వెల్లడించిన నీతి ఆయోగ్

NITI Aayog: లాభాపేక్ష లేని వైద్యశాలలకు ప్రోత్సాహకాలు.. వెల్లడించిన నీతి ఆయోగ్

NITI Aayog: లాభాపేక్ష లేని వైద్యశాలలకు ప్రోత్సాహకాలు.. వెల్లడించిన నీతి ఆయోగ్

NITI Aayog: లాభాపేక్ష లేని వైద్యశాలలకు ప్రోత్సాహకాలు.. వెల్లడించిన నీతి ఆయోగ్

ప్రైవేటు విభాగంలో ఆరోగ్య రంగాన్ని విస్తరించేందుకు పెట్టుబడి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యులు వీకే సింగ్. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఇలాంటి అవరోధాలను అధిగమించే అవకాశం కలుగుతుందన్నారు. లాభాపేక్షలేని వైద్య రంగం అభివృద్ధికి సైతం ఈ ఉద్దీపన చర్యలు తోడ్పడతాయని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

లాభాపేక్ష లేని వైద్య సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ప్రకటించింది నీతి ఆయోగ్. దేశంలో లాభాపేక్షలేని హాస్పిటల్ మోడల్‌పై సమగ్ర అధ్యయనాన్ని సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఇలాంటి సంస్థల విషయంలో సమాచార లోపాన్ని అరికట్టడంలో అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది. ప్రైవేటు విభాగంలో ఆరోగ్య రంగాన్ని విస్తరించేందుకు పెట్టుబడి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యులు వీకే సింగ్. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ద్వారా ఇలాంటి అవరోధాలను అధిగమించే అవకాశం కలుగుతుందన్నారు. లాభాపేక్షలేని వైద్య రంగం అభివృద్ధికి సైతం ఈ ఉద్దీపన చర్యలు తోడ్పడతాయని పేర్కొన్నారు.

లాభాపేక్ష లేని వైద్యశాలలను ట్రస్టులు, ఇతర సంస్థలు ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ నామమాత్రపు ధరల్లోనే వైద్య సేవలను అందిస్తారు. ఇలాంటి ఆసుపత్రుల ఆపరేషన్ మోడల్‌పై నీతి ఆయోగ్ నివేదిక దృష్టి సారించింది. 2018 జూన్ నాటికి అనారోగ్యాలకు చేసే చికిత్సల్లో లాభాపేక్షలేని ఆసుపత్రుల వాటా 1.1 శాతం మాత్రమే ఉంది. లాభాల కోసం పనిచేసే ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స కోసం వెళ్లే ఇన్ పేషెంట్స్ సంఖ్య 55.3 శాతంగా ఉంది. ఇదే సమయంలో లాభాపేక్ష లేని వైద్యశాలలు దేశంలోని 2.7 శాతం మందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని నివేదిక పేర్కొంది.

‘ఇన్ పేషెంట్ సేవల విషయంలో లాభాపేక్ష లేని హాస్పిటళ్లలో అయ్యే ఖర్చు.. లాభాల కోసం పనిచేసే ప్రైవేటు హాస్పిటళ్లలో అయ్యే ఖర్చులో పావు వంతు మాత్రమే ఉంటుంది. ఇలాంటి వైద్యశాల్లో డాక్టర్ లేదా సర్జన్ ఛార్జీలు సుమారు 36 శాతం తక్కువగా ఉంటాయి. బెడ్ ఛార్జీలు సైతం లాభాపేక్షలేని ఆసుపత్రుల్లో సుమారు 44 శాతం తక్కువ’ అని నివేదిక తెలిపింది.

లాభాపేక్షలేని ఆసుపత్రుల్లో OPD కేర్ ఖర్చు.. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మూడింట ఒక వంతు తక్కువగా ఉంటుంది. ఈ హాస్పిటళ్లు రోగులకు 26 శాతం తక్కువ ధరకు మెడిసిన్ అందిస్తున్నట్లు NSS 75వ రౌండ్ డేటా వెల్లడించింది. అవుట్ పేషెంట్ సేవల డాక్టర్ ఫీజు సైతం ఇక్కడ సుమారు 18 శాతం తక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

లాభాపేక్ష లేని వైద్య సంస్థల అభివృద్ధికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను నీతి ఆయోగ్ ప్రకటించింది. సెక్షన్ 80జి కింద ఈ సంస్థలకు అందే విరాళాలకు 100 శాతం ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి ఆసుపత్రులను గుర్తించడానికి ప్రమాణాలను అభివృద్ధి చేయడం, జాతీయ స్థాయి పోర్టల్ లేదా డైరెక్టరీని ఏర్పాటు చేయడం, వీటి పనితీరు ద్వారా ర్యాంకింగ్ ఇవ్వడం, తద్వారా ఎక్కువ మొత్తంలో చట్ట ప్రకారం విరాళాలు పొందే అవకాశాన్ని సృష్టించడం.. వంటి చర్యలు చేపట్టనున్నట్లు నీతి ఆయోగ్ రిపోర్టు వెల్లడించింది.

తక్కువ వడ్డీ రేటుతో వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయాన్ని కేంద్రం పరిగణిస్తోంది. ఇది లాభాపేక్షలేని ఆసుపత్రులకు ఆర్థికంగా మరింత లాభదాయకంగా ఉంటుందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. అవసరమైన సమయాల్లో నగదు సేకరించడానికి సహాయపడుతుందని తెలిపింది.

First published:

Tags: Niti Aayog

ఉత్తమ కథలు