Home /News /national /

NITI AAYOG COUNTERS TELANGANA CM KCR ALLEGATIONS AMID NITI AAYOG USELESS REMARKS PM MODI TO CHAIR NITI MEET TODAY MKS

CM KCR | NITI Aayog : కేసీఆర్‌ ఆరోపణలు పచ్చి తప్పులు : నీతి ఆయోగ్ దిమ్మతిరిగే కౌంటర్..

నీతి ఆయోగ్, కేంద్రంపై కేసీఆర్ ఫైర్

నీతి ఆయోగ్, కేంద్రంపై కేసీఆర్ ఫైర్

ప్రణాళికా సంఘం స్థానంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ఇప్పుడొక నిరర్థక సంస్థలా మారిందని, నీతి ఆయోగ్ సమావేశాలు.. మోదీ భజన మండలిగా మారాయన్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై థింక్ ట్యాంక్ అంతే ఘాటుగా స్పందించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi Cantonment | Hyderabad
దేశం ఏ దిశగా అభివృద్ధి పథంలో ముందుకెళ్లాల్లో నిర్ణయించే ప్రణాళికా సంఘం స్థానంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ (NITI Aayog) ఇప్పుడొక నిరర్థక సంస్థలా మారిందని, నీతి ఆయోగ్ సమావేశాలు.. మోదీ భజన మండలిగా మారాయని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) చేసిన సంచలన ఆరోపణలపై థింక్ ట్యాంక్ సైతం అంతే ఘాటుగా స్పందించింది. నీతి ఆయోగ్ వృధా అంటూ కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకూ ఆ సంస్థ వివరణాత్మక కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం జరుగనున్న కీలక సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించడం దురదృష్టకరం అంటూనే, తెలంగాణ సీఎం విమర్శలన్నీ పచ్చి తప్పులంటూ నీతి ఆయోగ్ వివరణ ఇచ్చింది..

తెలంగాణ సర్కారుతో సంప్రదించకుండానే నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం అజెండాను రూపొందించారన్న సీఎం కేసీఆర్‌ ఆరోపణలు అవాస్తవమని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అందరితో సంప్రదించిన తర్వాతే ఆదివారం జరిగే సమావేశ అజెండాను ఖరారు చేసినట్లు వెల్లడించింది. 2021 జనవరి 21న నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో తెలంగాణ సీఎంను కూడా కలిసిందని గుర్తుచేసిన సంస్థ.. తాజా సమావేశంపై చర్చించేందుకు ఎన్ని సార్లు అభ్యర్థనలు పంపినా కేసీఆర్‌ స్పందించలేదని తెలిపింది.

CM KCR : అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు? -మునుగోడు బైపోల్ కంటే అదే బెటరా?


కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల చూపుతున్న వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మేథో సంస్థపై కేసీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన గంట లోపే నీతి ఆయోగ్‌ స్పందించడం విశేషం. జాతీయ ప్రాధాన్యం గల అన్ని అంశాలపై ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నట్లు నీతి ఆయోగ్ వివరించింది.

Munugode Bypoll : మునుగోడుకు భారీగా నిధులు.. అమల్లోకి CM KCR హామీలు.. కోమటిరెడ్డి కోరిందే?


ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరుగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశ అజెండా రూపకల్పన కోసం తెలంగాణతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం విస్తృతంగా చర్చలు జరిపామని, దాదాపు ఆరు నెలల పాటు జరిగిన చర్చల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారని, ఈ చర్చల ఫలితంగానే 2022 జూన్‌లో ధర్మశాలలో జాతీయ స్థాయి ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగిందని నీతి ఆయోగ్ పేర్కొంది.

Nethanna Beema : దేశంలోనే తొలిసారి.. రైతు బీమా తరహాలో చేనేత కుటుంబాలకు రూ.5లక్షలు : KTR


వాస్తవాలు ఇలా ఉంటే.. నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనబోమని కేసీఆర్‌ ప్రకటించడం దురదృష్టకరమని సంస్థ తన ప్రకటనలో వ్యాఖ్యానించింది. అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునే ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి నాయకులు పాల్గొంటారని, దానికి కేసీఆర్‌ రాకపోవడం విచారకరమని తెలిపింది. పటిష్ఠమైన రాష్ట్రాలతో బలమైన దేశాన్ని రూపొందించాలన్న లక్ష్యంతోనే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశారని, సమాఖ్య స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేసేందుకు అనేక చర్యలు చేపట్టారని నీతి ఆయోగ్‌ వివరించింది.

Gold Silver Rates : తగ్గిన బంగారం ధరలు.. వెండి రేటు భారీగా పతనం.. ఎంతంటే..


గడిచిన ఏడాదిలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌, సభ్యులు దాదాపు 30 సమావేశాలు నిర్వహించారని.. రాష్ట్రాలకు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అనేక సమస్యలను పరిష్కరించారని నీతి ఆయోగ్ వెల్లడించింది. గత నాలుగేళ్లుగా భారత ప్రభుత్వం జలజీవన్‌ మిషన్‌ కింద రూ.3982 కోట్లు కేటాయించిందని, అయితే రాష్ట్రం కేవలం రూ.200 కోట్లే తీసుకుందని తెలిపింది.



అంతేగాక, 2014-15 నుంచి 2021-22 వరకు తెలంగాణకు పీఎం కిసాన్‌ యోజన, ఏఐబీపీ, కమాండ్‌ ఏరియా నీటి నిర్వహణ కింద రూ.1195 కోట్లు కేటాయించామని నీతి ఆయోగ్ వివరించింది. కేంద్ర పథకాలు, జాతీయ ప్రాధాన్యం గల కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆర్థికంగా నిరంతరం మద్దతునిస్తోందని తెలిపింది. 2015-16లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.2,03,740 కోట్లు కేటాయించగా, అది 2022-23కు రూ.4,42,781 కోట్లకు పెరిగిందని సంస్థ వివరించింది. నీతి ఆయోగ్ పై కేసీఆర్ విమర్శలను బీజేపీ నేతలను సైతం తీవ్రస్వరంతో ఖండించారు. ఆదివారం నాటి సమావేశంలో ప్రధాని మోదీ కూడా కేసీఆర్ ఆరోపణలపై పరోక్షంగానైనా స్పందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం నీతి ఆయోగ్ భేటీకి గైర్హాజరవుతున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, CM KCR, Niti Aayog, Pm modi, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు