నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ ఈవెంట్ ప్రారంభం అయ్యింది. ముంబైలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ గారాల పట్టీ ఇషా అంబానీ మట్లాడుతూ... ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబం తరపున.. నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌కు అందరికీ ఘన స్వాగతం పలికారు. ఇండియాలో ఇది ఫైనస్ట్ ఫ్లాట్ ఫామ్ అన్నారు. అన్ని రకాల కళల ప్రదర్శనకు ఇది అద్భుతమైన వేదిక అన్నారు. అన్ని రకాల కార్యక్రమాలకు ఒకే ఒక్క వేదిక నీతా ముఖేష్ అంబనీ కల్చరల్ సెంటర్ అన్నారు.
తన తల్లికి క్లాసికల్ డాన్స్ అంటే ఎంతో ఇష్టమన్నారు. జీవితాంతం ఆరాధించే కళకు తన తల్లి అందించే ఘన నివాళి ఈ కల్చరల్ సెంటర్ అన్నారు ఇషా అంబానీ . తన తల్లి కల ఇన్నాళ్లుకు నెరవేరిందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు ఇషా. అనేక ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కలను సాకారం చేసుకోవడానికి ఇది గొప్ప వేదిక కావాలన్నారు. వారు ఎక్కడ నుంచి వచ్చిన వారైనా సరై.. ఈ వేదిక వారందరికీ ఉపయోగపడాలన్నారు. భారతదేశానికి గొప్పగా నిలబడాలన్నారు.
మొదటిసారిగా.. 350 మంది కళాకారులు ఒకేసారి ఈ వేదికపై ప్రదర్శన చేయవచ్చన్నారు. 1100 కాస్టూమ్స్ థియేట్రికల్ ప్రిడక్షన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఇంతవరకు ఎక్కడ లేని విధంగా నీతా ముఖేష్ అంబనీ కల్చరల్ సెంటర్‌లో లైవ్‌లో ఆర్కెస్టా కూడా ఉంటుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Isha Ambani, Mukesh Ambani, Nita Ambani