సమాజసేవలో రిలయన్స్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుంది. దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఏదో ఒక రూపంలో అంబానీ ఫ్యామిలీ ఆదుకుంటూనే ఉంటుంది. కేరళ, చెన్నై వరద విలయ సమయంలోనూ బాధితులకు అండగా నిలిచింది. నిత్యావసర వస్తువులను పంపిణీతో పాటు గృహోపకరాణాలకు మరమ్మత్తులు చేయించింది. జియో ద్వారా ఉచిత టెలికాం సేవలను అందించింది. పుల్వామా అమరవీరుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు వారి పిల్లల విద్య, ఉద్యోగ బాధ్యతలను కూడా తీసుకుంది. తాజాగా ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహ వేడుకల సందర్భంగా సాయుధ బలగాల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేశారు. ధీరూబాయి అంబానీ స్వ్వేర్లో మ్యూజికల్ ఫౌంటెన్ షో నిర్వహించారు.
ఇందుకోసం అంబానీ స్వ్కేర్‌లో 600 ఎల్ఈడీ లైట్స్, మిస్ట్ ఎమిటర్స్, ఫైర్ ఎఫెక్ట్స్, 45 ఫీట్ల మేర నీటిని ఎగజిమ్మే నాజిల్స్ ఏర్పాటు చేశారు. సాయుధ బలగాలు, పోలీసులకు గౌరవ సూచకంగా ఫౌంటెన్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నూతన దంపతులు ఆకాశ్-శ్లాకాను సాయుధ బలగాలకు కుటుంబాలు దీవించాయి. సుమారు 7వేల మంది ఆర్మీ, పోలీస్ కుటుంబాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో కలర్‌ఫుల్ వాటర్ ఫౌంటెన్, మ్యాజికల్ బృందావన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారుల నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా సాయుధ బలగాల కుటుంబాల కోసం స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. అమరవీరుల కుటుంబాలకు విద్య, ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akash Ambani, Mukesh Ambani, Mumbai, Nita Ambani, Reliance