ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్క్వేర్‌... జాతికి అంకితం చేసిన నీతా అంబానీ

నీతా అంబానీ

ముంబై నగరం పట్ల మరోసారి తన ప్రేమను చాటుకుంది ముఖేశ్ అంబానీ కుటుంబం. ‘‘ ధీరూభాయ్ అంబానీ స్క్వేర్’’ను జాతికి అంకితం చేశారు నీతా అంబానీ. ఈ సందర్భంగా 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 • Share this:
  ముంబై నగరం పట్ల మరోసారి తన ప్రేమను చాటుకుంది ముఖేశ్ అంబానీ కుటుంబం.  20 మిలియన్ల నగర ప్రజల కోసం ‘‘ ధీరూభాయ్ అంబానీ స్క్వేర్’’ను ప్రారంభించిన నీతా అంబానీ.. దానిని జాతికి అంకితం చేశారు. ముంబైలోని అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు ఎదురుగా ఉన్న ప్రపంచ శ్రేణి జియో వరల్డ్ సెంటర్‌లో భాగమైన ధీరూభాయ్ అంబానీ స్క్వేర్‌ను ఇవాళ రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ప్రారంభించారు.

  Reliance Foundation, Dhirubhai Ambani Square, Jio World Centre, Nita Ambani, Nita Ambani at Jio World Centre, Mumbai Dhirubhai Ambani square, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూబాయి అంబానీ స్క్వేర్, జియో వరల్డ్ సెంటర్, నీతా అంబానీ, నీతా అంబానీ జియో వరల్డ్ సెంటర్, ముంబై ధీరాబాయ్ అంబానీ స్క్వేర్,
  నీతా అంబానీ

  ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె భారతదేశం గర్వించదగిన ముద్దుబిడ్డ ధీరూభాయ్ అంబానీ దూరదృష్టి ఫలితమే ధీరుభాయ్ అంబానీ స్క్వేర్, జియోవరల్డ్ సెంటర్‌ అని అభిప్రాయపడ్డారు. ఈ అద్భుతమైన ఫౌంటెయిన్ అందరి హృదయాంతరాల్లో సంతోషాన్ని, విశ్వాసాన్ని నింపుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ మ్యూజికల్ ఫౌంటెయిన్ ముంబై వాసులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తుందన్నారు. జియో వరల్డ్ సెంటర్‌లోని ఈ స్క్వేర్ భవిష్యత్ ముఖచిత్రాన్ని మార్చేలా సందర్శకుల ఆదరణ పొందుతుందన్నారు. ముంబై నగర వైభవాన్ని చాటిచెప్పేలా కీర్తికెక్కుతుందన్నారు.

  Reliance Foundation, Dhirubhai Ambani Square, Jio World Centre, Nita Ambani, Nita Ambani at Jio World Centre, Mumbai Dhirubhai Ambani square, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూబాయి అంబానీ స్క్వేర్, జియో వరల్డ్ సెంటర్, నీతా అంబానీ, నీతా అంబానీ జియో వరల్డ్ సెంటర్, ముంబై ధీరాబాయ్ అంబానీ స్క్వేర్,
  నీతా అంబానీ, ముఖేష్ అంబానీ

  ఈ సందర్భంగా 2000 మంది పిల్లలతో మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక, తమ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం నేపథ్యంలో ముంబైలోని అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో వారం రోజుల పాటు సాగే అన్నదాన కార్యక్రమాన్ని అంబానీ దంపతులు ప్రారంభించారు. కుటుంబసభ్యులతో కలిసి 2000 మంది పిల్లలకు భోజనం వడ్డించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  Reliance Foundation, Dhirubhai Ambani Square, Jio World Centre, Nita Ambani, Nita Ambani at Jio World Centre, Mumbai Dhirubhai Ambani square, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూబాయి అంబానీ స్క్వేర్, జియో వరల్డ్ సెంటర్, నీతా అంబానీ, నీతా అంబానీ జియో వరల్డ్ సెంటర్, ముంబై ధీరాబాయ్ అంబానీ స్క్వేర్,
  నీతా అంబానీ

  మార్చి 12న మరో రెండు మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేయనున్నట్టు నీతా అంబానీ చెప్పారు. ముంబై నగర గొప్పదనాన్ని చాటిచెప్పేలా , ముంబైనగరాన్ని అన్నిరకాలుగా సురక్షితంగా ఉంచుతున్న వారందరినీ కీర్తించేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. సమాజంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని నీతా అంబానీ స్పష్టం చేశారు.

  First published: