కరోనా వైరస్ తో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె తన ప్రసంగాన్ని నోబుల్ గ్రహీత, బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ కవితతో ప్రారంభించారు. ఠాగూర్ కవిత్వంలోని సారాన్ని ప్రస్తావిస్తూ ‘‘మునుపెన్నడూ లేని వైపరీత్యాల నడుమ.. ఈ సారి బడ్జెట్ రూపకల్పన చేశాం. కరోనా కారణంగా 2020లో అందరికీ ప్రతికూల అనుభవం ఎదురైంది. అయినప్పటికీ, ఎటువంటి ఆందోళన చెందకుండా దేశమంతా విశ్వాసంతో ముందుకు సాగాలి.” అని అన్నారు. దీనికి కొనసాగింపుగా ఠాగూర్ కవిత్వాన్ని ప్రస్తామించారు. ‘‘తెలవారక ముందే అనగా చీకటిగా ఉన్న సమయంలోనే పక్షి వెలుతురును అనుభవిస్తుంది. విశ్వాసం అంటే అదే. అదే స్పూర్తితో మనం కూడా ముందుకు సాగాలి.’’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలోని వ్యాక్యాన్ని వినిపించారు.
అయితే, పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బెంగాల్ ఓటర్ల ప్రసన్నం చేసుకోవడానికే ఆర్థిక మంత్రి ఠాగూర్‌ను గుర్తిచేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగంలో ఠాగూర్ కవిత్వాన్ని గుర్తుచేయడం, బెంగాళీ సాంప్రదాయ దుస్తులైన ఎరుపు రంగు లాల్ పార్ చీరను ఆర్థిక మంత్రి ధరించడం వంటివి దీనికి నిదర్శనమని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే, రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో దీదీని ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ సారి ఎలాగైనా తృణముల్ కాంగ్రెస్‌ను ఓడించి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
బెంగాల్ ఎన్నికల కోసమేనంటూ నెటిజన్ల కామెంట్..
Of course. Tagore. #budgetwithndtv https://t.co/hQUfxyjUhN
— Gargi Rawat (@GargiRawat) February 1, 2021
కాగా, హౌరాలో ఇటీవల జరిగిన హై-డెసిబెల్ ర్యాలీలలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘‘జన గణ మన’’- జాతీయ గీతాన్ని బీజేపీ నేతలు తప్పుగా పాడారని తృణమూల్ కాంగ్రెస్ వారిపై ఆరోపణలు చేసింది. దీంతో, బెంగాల్ ఓటర్లలో బీజేపీపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని గ్రహించిన మోదీ ప్రభుత్వం, బడ్జెట్ ప్రసంగంలో ఠాగూర్‌ను ప్రస్థావించినట్లు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
FM Sitharaman evokes Rabindranath Tagore during the budget speech.
Eye on the WB polls? FM does seem to be a fan of poetry, though. Last year she had quoted Tamil poetry. #BudgetWithET @EconomicTimes
— Anjali Venugopalan @ET (@anjalivenu) February 1, 2021
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఠాగూర్ ను ప్రస్తావించడంపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. నెటిజన్లలో చాలామంది.. ఇది ముందే ఊహించిందని, ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఆశ్చర్యపర్చలేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రముఖ రచయిత సుహెల్ సేథ్ ట్విట్టర్లో స్పందిస్తూ ‘‘ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ఠాగూర్‌ను ప్రస్తావిస్తారని మేం ముందే ఊహించాం.’’ అని అన్నారు. మొత్తానికి, బెంగాల్ ఎలక్షన్స్ హీట్ పార్లమెంట్ ను కూడా వదలడం లేదని స్పష్టమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2021, Nirmala sitharaman, Union budget 2020-2021