• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • NIRMALA SITHARAMAN BLAMES INDIAN PUBLIC SECTOR BANKS WORST PHASE UNDER THE MANMOHAN SINGH AND RAGHURAM RAJAN MK

మన్మోహన్, రఘురాం వల్లనే ప్రభుత్వం బ్యాంకుల పతనం...నిర్మల సంచలన ఆరోపణలు

మన్మోహన్, రఘురాం వల్లనే ప్రభుత్వం బ్యాంకుల పతనం...నిర్మల సంచలన ఆరోపణలు

నిర్మలా సీతారామన్ (File)

ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్, ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ ఉన్నపుడే ప్రభుత్వ బ్యాంకులు అత్యంత దుర్భరమైన దశను ఎదుర్కొన్నాయన్న నిర్మల అన్నారు. కేవలం ఫోన్ కాల్ ద్వారానే కార్పోరేట్ కంపెనీలకు వేల కోట్లు రుణాలు ఇచ్చారని ఆమె ఆరోపించారు.

  • Share this:
    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వల్లనే ప్రభుత్వ రంగ బ్యాంకులు దెబ్బతిన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులలో రుణాల ఎగ్గొట్టిన వారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని ఆమె విమర్శించారు. కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్‌ కార్యక్రమంలో ఆమె ప్రసగింస్తూ ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రాఘురాం రాజన్ చెబుతున్న ప్రతి మాట ఆయనకే వర్తిస్తుందని అన్నారు. అలాగే ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్, ఆర్‌బిఐ గవర్నర్‌గా రఘురాం రాజన్ ఉన్నపుడే ప్రభుత్వ బ్యాంకులు అత్యంత దుర్భరమైన దశను ఎదుర్కొన్నాయన్న నిర్మల అన్నారు. కేవలం ఫోన్ కాల్ ద్వారానే కార్పోరేట్ కంపెనీలకు వేల కోట్లు రుణాలు ఇచ్చారని ఆమె ఆరోపించారు.
    Published by:Krishna Adithya
    First published: