ఢిల్లీ కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి..

నిర్భయ నిందితులకు డెత్ వారెంట్ వాయిదా వేయడంతో నిర్భయ తల్లి కోర్టులోనే కన్నీటి పర్యంతమైంది.

news18-telugu
Updated: December 18, 2019, 3:38 PM IST
ఢిల్లీ కోర్టులో కన్నీటిపర్యంతమైన నిర్భయ తల్లి..
నిర్భయ తల్లి
  • Share this:
ఢిల్లీ కోర్టు నిర్భయ నిందితుల డెత్ వారెంట్ వాయిదా వేయడంతో నిర్భయ తల్లి కోర్టులోనే కన్నీటి పర్యంతమయ్యారు.క్షమాభిక్ష దరఖాస్తు కోసం న్యాయమూర్తి నిందితులకు గడువు ఇవ్వడంపై నిర్భయ తల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్లినా దోషుల హక్కుల గురించే మాట్లాడుతున్నారని.. మరి తమ హక్కుల మాటేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ తల్లి ఆవేదనపై స్పందించిన న్యాయమూర్తి.. మీ ఆవేదనను అర్థం చేసుకోగలనని, మీపై సానుభూతి ఉందని చెప్పారు. అయితే దోషులకు కూడా హక్కులు ఉంటాయని.. చట్టాన్ని తాము అనుసరించాల్సిందేనని చెప్పారు.

నిర్భయ దోషులకు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేస్తున్నారా? అని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆరా తీసింది. కాగా, అత్యాచార కేసుల్లో మృగాళ్లకు క్షమాభిక్ష అవసరం లేదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులు క్షమాభిక్షకు వెళ్తారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ దోషులు క్షమాభిక్షకు వెళ్తే ఉరిశిక్ష మరి కాస్త
ఆలస్యం కావచ్చు. లేనిపక్షంలో వారం రోజుల గడువు తర్వాత వారిని ఉరితీసే అవకాశం ఉంది.

First published: December 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు