హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయ దోషులను మీ చివరి కోరిక ఏంటని అడిగితే..

నిర్భయ దోషులను మీ చివరి కోరిక ఏంటని అడిగితే..

Nirbhaya Convicts : నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

    నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే తీహార్ జైలు అధికారులు డమ్మీ ఉరిపై ట్రయల్స్‌ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులు దోషులకు చివరి కోరిక చెప్పాలని నోటీసులు జారీ చేశారు. అయితే.. వాళ్లు ఏ సమాధానం ఇవ్వలేదట. ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబివ్వలేదట. ఉరి శిక్ష దగ్గరపడుతుందన్న భయంతో వాళ్లు ఆహారం తక్కువగా తింటున్నారట. టెన్షన్ టెన్షన్‌గా ఉంటున్నారట. నలుగురికీ వైద్యులు రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెడికల్ రిపోర్టుల్లో ఆరోగ్యం బాగానే ఉంటున్నట్లు తేలుతోందట. కాగా, వీరి సెల్ బయట గార్డులు గట్టిగానే కాపలా కాస్తున్నారు.

    ఇదిలా ఉండగా, చివరి కోరిక ప్రకారం.. కుటుంబ సభ్యులు, దగ్గరి వారిని కలవటం, తనకు చెందిన స్థిరాస్తులు మరొకరికి బదిలీ చేయటం, ఏదైనా పుస్తకం కావాలని కోరడం, ఆధ్యాత్మిక గురవును కలవడం వంటివి కోరవచ్చు. అవి న్యాయసమ్మతంగా ఉంటే.. ఆ కోరికలను నెరవేర్చుతారు.

    First published:

    Tags: National News, Nirbhaya, Supreme Court

    ఉత్తమ కథలు