హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirbhaya Case: ఉరి తీసే ముందు నిర్భయ దోషుల చివరి కోరిక...

Nirbhaya Case: ఉరి తీసే ముందు నిర్భయ దోషుల చివరి కోరిక...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి పూరీ, సబ్జి, కచోరీ తినిపించాలని ఉందని జైలు అధికారులను కోరినట్లు సమాచారం అందుతోంది.

నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహారు జైలులో ఈ తెల్లవారు జామున ఉరి తీశారు. అయితే ఉరి తీసే ముందు దోషులకు చివరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకునే అవకాశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ తల్లి తన కుమారుడికి పూరీ, సబ్జి, కచోరీ తినిపించాలని ఉందని జైలు అధికారులను కోరినట్లు సమాచారం అందుతోంది. అలాగే మిగితా దోషులకు గత రాత్రి మంచి భోజనం ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది.  శుక్రవారం ఉదయం ఉరి తీయడానికి ముందు చివరి కోరిక ఏమిటని అడిగితే వారు ఎలాంటి కోరిక కోరలేదని తిహార్ సెంట్రల్ జైలు డైరెక్టర్ జనరల్ తెలిపారు.

ఇదికూడా చూడండి :

First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు