హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirbhaya case: ఉరి తీసే ముందు నిర్భయ దోషులు ఏం చేశారంటే...

Nirbhaya case: ఉరి తీసే ముందు నిర్భయ దోషులు ఏం చేశారంటే...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నలుగురు దోషులు కూడా జైలు అధికారులతో తమ ఇష్ట దైవాలను తలచుకునే సమయం అక్కర్లేదని తిరస్కరించినట్లు సమాచారం.

తీహార్ జైలులో నిర్భయ దోషులను ఉరి తీసే ముందు తమ చివరి కోరిక ఏంటని అడగగా, అలాంటివేమీ లేవని నలుగురు దోషులు తేల్చిచెప్పారు. అంతే కాదు నలుగురు దోషులు ఉరి తీసే ముందు దైవ ప్రార్థన చేసేందుకు సైతం నిరాకరించారు. నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25)లను తిహార్ జైలు అధికారులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు నిద్ర లేపారు. అనంతరం వారిని స్నానం చేయాలని కోరినట్లు సమాచారం. ఆ తర్వాత నలుగురు దోషులన ఇష్టమైన మతపరమైన పూజలు చేసుకునేందుకు జైలు అధికారులు సమయం కేటాయించారు. అయితే నలుగురు దోషులు కూడా జైలు అధికారులతో తమ ఇష్ట దైవాలను తలచుకునే సమయం అక్కర్లేదని తిరస్కరించినట్లు సమాచారం. నలుగురు దోషులను ఉరి తీసే ముందు తాము ఎలాంటి పూజలు చేయమని తేల్చి చెప్పడంతో జైలు అధికారులు వారికి అల్పాహారం అందించారు. అనంతరం నలుగురు దోషులను వైద్యులు పరీక్షించారు. నలుగురు దోషులకు జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో కాటన్ వస్త్రంతో ముఖాలను కప్పి ఉరికంబం ఎక్కించారు. తిహార్ జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్ ల సమక్షంలో జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశానుసారం తలారి పవన్ జల్లాద్ ఉరి తీశారు.

ఇదికూడా చూడండి :

First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు