క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోలేదు.. ఆ పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వండి : నిర్భయ నిందితుడు

తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదన్నాడు వినయ్ శర్మ. క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేయలేదని అన్నాడు. దానిపై ఉన్న సంతకం కూడా తనది కాదని కాదన్నాడు.

news18-telugu
Updated: December 7, 2019, 6:29 PM IST
క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోలేదు.. ఆ పిటిషన్ ఉపసంహరణకు అనుమతివ్వండి : నిర్భయ నిందితుడు
నిర్భయ నిందితుడిని కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యం
  • Share this:
దిశా హత్యాచార ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత నిర్భయ కేసులో న్యాయం ఎప్పుడు జరుగుతుందని దేశవ్యాప్తంగా చాలామంది ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్భయ నిందితుడు వినయ్ శర్మ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కి క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా కథనాలు వచ్చాయి. ఈ ప్రచారంపై నిందితుడు వినయ్ శర్మ తాజాగా స్పందించాడు. తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదన్నాడు. క్షమాభిక్ష పిటిషన్‌పై సంతకం చేయలేదని అన్నాడు. దానిపై ఉన్న సంతకం కూడా తనది కాదని కాదన్నాడు. తన పేరుతో రాష్ట్రపతికి చేరిన క్షమాభిక్ష పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలన్నారు.

కాగా,అత్యాచార ఘటనల్లో నిందితులకు క్షమాభిక్ష పెట్టనని శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో వినయ్ శర్మ ప్రకటన కూడా తెర పైకి వచ్చింది. ఇదిలా ఉంటే,నిర్భయ ఘటనలో మొత్తం ఆరుగురు దోషుల్లో ఒకరు మైనర్ కావడంతో అతనికి 3సంవత్సరాల జైలు శిక్ష పడింది. మిగతా నిందితుల్లో రామ్‌సింగ్ అనే వ్యక్తి 2013లో జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురికీ ఉరిశిక్ష విధించినా ఇంకా అమలు కాలేదు. దిశా ఘటన నేపథ్యంలో నిర్భయ నిందితులను కూడా త్వరలోనే ఉరి తీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>