మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషి..

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. జనవరి 17న ముఖేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.


Updated: January 25, 2020, 3:09 PM IST
మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్భయ దోషి..
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. జనవరి 17న ముఖేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.
  • Share this:
నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. తీహార్ జైలులో ఉదయం 6 గంటలకు వారిని ఉరితీయనున్నారు. ఇప్పటికే పలు విధాలుగా ఉరిశిక్షను ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు చేసిన దోషులు.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్ కోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. జనవరి 17న ముఖేష్ కుమార్ సింగ్ పెట్టుకున్న అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.

2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులంతా దోషులుగా తేలారు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. దోషిగా తేలిన మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు 2013 సెప్టెంబర్‌లో తీర్పు వెలురించింది. 2014 మార్చిలో ఈ తీర్పును ధ్రువీకరించిన సుప్రీంకోర్టు.. దీన్ని సమర్థిస్తూ 2017 మేలో తీర్పు వెలువరించింది. నిందితులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్లను సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు