హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirbhaya Case: నేరం నుంచి శిక్ష వరకు... నిర్భయ కేసు సాగిందిలా...

Nirbhaya Case: నేరం నుంచి శిక్ష వరకు... నిర్భయ కేసు సాగిందిలా...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలును మరింత ఆలస్యం చేసేందుకు నిర్భయ కేసు నిందితులు న్యాయవ్యవస్థలోని అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని చూశారు.

నిర్భయ కేసు నిందితులకు ఉరి శిక్ష అమలైంది. కాస్త ఆలస్యమైనా... ఓ యువతిపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన వాళ్లు చట్టపరంగా శిక్షింపబడ్డారు. నిందితులకు శిక్ష అమలుకావడంపై దేశవ్యాప్తంగా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. శిక్ష నుంచి తప్పించుకునేందుకు, శిక్ష అమలును మరింత ఆలస్యం చేసేందుకు నిందితులు న్యాయవ్యవస్థలోని అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని చూశారు. అందులో కొంతవరకు విజయం సాధించారు. అయితే చివరకు న్యాయమే గెలిచింది. అసలు ఈ కేసులో నిర్భయపై దాడి మొదలు.... దోషులకు ఉరి శిక్ష అమలు వరకు ఎప్పుడు ఏం జరిగిందనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

Dec 16, 2012: పారామెడికల్ విద్యార్థి, బాధితురాలు నిర్భయపై ఆరుగురు వ్యక్తులు ఓ ప్రైవేటు బస్సులో అతి దారుణంగా అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను కదులుతున్న బస్సు నుంచి బయటపడేశారు. దీంతో బాధితులను సఫ్దార్ గంజ్ ఆస్పత్రిలో చేర్పించారు.

Dec 17, 2012: ఘటనపై దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నిరసనలు వెల్లువెత్తాయి. ఘటనకు పాల్పడిన నిందితులు రామ్ సింగ్, ముఖేష్, వినయ్ శర్మ, పవన్ గుప్తాలను పోలీసులను గుర్తించారు.

Dec 20, 2012: బాధితురాలి స్నేహితుడు వాంగ్మూలం తీసుకున్నారు.

Dec 21, 2012: కేసులో ఆరో నిందితుడిగా ఉన్న అక్షయ్ ఠాకూర్‌ను గుర్తించారు.

Dec 22, 2012: ఠాకూర్‌ను ఢిల్లీ తీసుకొచ్చి అతడి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.

Dec 25, 2012: విషమించిన బాధితురాలు నిర్భయ ఆరోగ్యం

Dec 26, 2012: మెరుగైన వైద్యం కోసం నిర్భయను సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలింపు

Dec 29, 2012: నిర్భయ కన్నుమూత. దోషులపై హత్య కేసు నమోదు

Jan 2, 2013: లైంగిక దాడుల కేసుల విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన నాటి చీఫ్ జస్టిస్ అల్తమాస్ కబీర్

Jan 3, 2013: కేసులో దోషులుగా ఉన్న ఐదుగురిపై హత్య సహా పలు కేసులు నమోదు

Jan 7, 2013: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ మొదలు

Mar 11, 2013: నిందితుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య

Aug 31, 2013: కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధింపు

Sep 13, 2013: నలుగురు నిందితులకు మరణశిక్ష విధించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు

Mar 15, 2014: నిందితుల మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే

May 5, 2014: నిందితుల మరణశిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు, అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్య

May 4, 2018: వినయ్ శర్మ, పవన్ గుప్తా రివ్యూ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

July 9, 2018: ముగ్గురు నిందితుల పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

Feb, 2019: నిందితులకు మరణశిక్షపై వారెంట్ కోరుతూ ఢిల్లీ కోర్టులో నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్

Dec 10, 2019: తన మరణశిక్షను సమీక్షించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన అక్షయ్

Dec 13, 2019: అక్షయ్ పిటిషన్‌ను వ్యతిరేకించిన నిర్భయ తల్లి

Dec 18, 2019: అక్షయ్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Dec 19, 2019: తాను జువైనల్ అనే వాదనను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

Jan 7, 2020: జనవరి 22న నలుగురు నిందితులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు వారెంట్

Jan 9, 2020: సుప్రీంకోర్టులో నిందితుడు ముఖేష్ క్యురేటివ్ పిటిషన్

Jan 9, 2020: సుప్రీంకోర్టులో నిందితుడు వినయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్

Jan 14, 2020: రాష్ట్రపతి వద్దకు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్

Jan 14, 2020: వినయ్ శర్మ, ముఖేష్ క్యురేటివ్ పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

Jan 14, 2020: డెత్ వారెంట్‌పై ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన ముఖేష్

Jan 15, 2020: క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తన ఉరి శిక్ష వాయిదా వేయాలని ఢిల్లీ కోర్టులో ముఖేష్ పిటిషన్

Jan 17, 2020: ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Jan 17, 2020: ఫిబ్రవరి 1న నిర్భయ నిందితులను ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్

Jan 18, 2020: నేరం జరిగిన సమయంలో తాను జువైనల్ అంటూ సుప్రీంకోర్టులో పవన్ గుప్తా పిటిషన్

Jan 20, 2020: పవన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Jan 25, 2020: రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముఖేష్

Jan 28, 2020: సుప్రీంకోర్టులో నిందితుడు అక్షయ్ క్యురేటివ్ పిటిషన్

Jan 29, 2020: రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముఖేష్ పిటిషన్ కొట్టివేత

Jan 29, 2020: రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టిన పెట్టుకున్న వినయ్ శర్మ

Jan 30, 2020: ఫిబ్రవరి 1న ఇచ్చిన డెట్ వారెంట్ నిలిపివేయాలని ఢిల్లీ కోర్టులో నిందితుల పిటిషన్

Jan 30, 2020: అక్షయ్ సింగ్ క్యురేటివ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Jan 31, 2020: తన జువైనల్ పిటిషన్‌ను కొట్టేయడంపై సుప్రీంకోర్టులో పవన్ గుప్తా రివ్యూ పిటిషన్

Jan 31, 2020: పవన్ గుప్తా రివ్యూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Jan 31, 2020: నిందితుల డెత్ వారెంట్‌ను వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు

Feb 1, 2020: ట్రయిల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం

Feb 5, 2020: నిందితులందరినీ ఒకేసారి ఉరి తీయాలన్న ఢిల్లీ హైకోర్టు

Feb 5, 2020: అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి

Feb 11, 2020: తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసిన వినయ్ శర్మ

Feb 14, 2020: వినయ్ శర్మ పిటిషన్ తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Feb 17, 2020: మార్చి 3 నిందితులకు డెత్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

Feb 20, 2020: ఢిల్లీ ఎన్నికల కోడ్, వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉందంటూ ఎన్నికల కమిషన్‌కు నిందితుల ఫిర్యాదు

Feb 28, 2020: తన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలంటూ సుప్రీంకోర్టులో పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్

Feb 29, 2020: రాష్ట్రపతి వద్ద మళ్లీ క్షమాభి క్ష్ పెట్టుకున్న అక్షయ్ సింగ్

Mar 2, 2020: పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు

Mar 2, 2020: నిందితుల మరణశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు స్టే.

Mar 4, 2020: పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి

Mar 5, 2020: మార్చి 20న నిందితులను ఉరి తీయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్ వారెంట్

Mar 12, 2020: తమ వారిని క్షమించాలని రాష్ట్రపతికి నిందితుల కుటుంబసభ్యుల లేఖ

Mar 16, 2020: తమ శిక్షపై స్టే విధించాలంటూ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన ముగ్గురు నిందితులు

Mar 18, 2020: ట్రయిల్ కోర్టు ఆర్డర్‌ను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ముఖేష్ సింగ్

Mar 18, 2020: బీహార్ కోర్టు విడాకుల పిటిషన్ వేసిన అక్షయ్ సింగ్ భార్య

Mar 19, 2020: తన క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన అక్షయ్

Mar 19, 2020: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అక్షయ్ వేసిన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

Mar 19, 2020: మార్చి 20న డెత్ వారెంట్‌పై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ పాటియాలా కోర్టు నిరాకరణ

Mar 19, 2020: రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంపై సుప్రీంకోర్టులో అక్షయ్ వేసిన పటిషన్ కొట్టివేత

Mar 19, 2020: నిందితుల శిక్ష అమలుపై స్టే విధించేందుకు సహేతుకమైన కారణాలు లేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ.

Mar 20, 2020: నిర్భయ కేసులోని నలుగురు నిందితులకు ఉదయం 5. 30 గంటలకు తీహార్ జైలులో ఉరి శిక్ష అమలు.

ఇదికూడా చూడండి :

First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు