Home /News /national /

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఇద్దరు తలారీలు..

నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఇద్దరు తలారీలు..

నిర్భయ దోషులు

నిర్భయ దోషులు

నిర్భయ దోషులను ఉరితీసేందుకు తాము తలారీగా పనిచేస్తామని తీహార్ జైలుకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 15 మంది లేఖలు రాశారని జైలు అధికారులు తెలిపారు.

  దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ గ్యాంగ్ రేప్ కేసులో త్వరలోనే దోషులను ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తీహార్ జైలు సూపరింటెండెంట్ ఉత్తర్ ప్రదేశ్ జైళ్లశాఖకు లేఖ రాశారు. ఇద్దరు తలారీలను అందుబాటులో ఉంచాలని.. తమకు అవసరమైనప్పుడు వారిని పంపించాలని కోరారు. ఐతే ఎవరిని, ఎప్పుడు ఉరితీసేందుకు? అన్న వివరాలను మాత్రం అందులో ప్రస్తావించలేదు. డిసెంబరు 9న తీహార్ జైలు నుంచి తమకు లేఖ అందిందని యూపీ జైళ్ల శాఖ అదనపు డీజీ ఆనంద్ కుమార్ తెలిపారు.

  ఇద్దరు తలారీలను నిర్భయ దోషులను ఉరి తీసేందుకే అడిగారని ప్రచారం జరుగుతోంది. యూపీ జైళ్ల శాఖకు ఇద్దరు అధికారిక తలారీలు ఉన్నారు. లక్నోలో ఒకరు, మీరట్‌లో ఒకరు చొప్పను ఇద్దరు తలారీలు ఉన్నారు. మరోవైపు నిర్భయ దోషులను ఉరితీసేందుకు తాము తలారీగా పనిచేస్తామని తీహార్ జైలుకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 15 మంది లేఖలు రాశారని జైలు అధికారులు తెలిపారు. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడుతో పాటు విదేశాల నుంచి కూడా లేఖలు వచ్చినట్లు వెల్లడించారు.

  మరోవైపు నిర్భయ కేసు దోషి అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌ను డిసెంబరు 17న విచారించనుంది కోర్టు. కాగా, నిర్భయ కేసులో మిగతా ముగ్గురు దోషులు ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34) రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. ఐతే అక్షయ్ కుమార్ (31) మాత్రం గతంలో రివ్యూ పిటిషన్ వేయలేదు. తాజాగా అక్షయ్ తరఫున ఆయన లాయర్ ఏపీ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఉరశిక్షలు నేరస్తులను మాత్రమే చంపగలవని... కాని నేరాలను నిర్మూలించలేవని పిటిషన్‌లో పేర్కొన్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Nirbhaya, Tihar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు