Nirbhaya Case: పవన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించిన రాష్ట్రపతి.. రేపే ఉరి

పవన్ గుప్తా(ఫైల్ ఫోటో)

నలుగురు దోషులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్, అక్షయ్‌కు మంగళవారం ఉదయం తీహార్ జైలులో ఉరిశిక్ష విధించనున్నారు. ఉరి అమలుకు సంబంధించి జైలు అధికారులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు.

  • Share this:
    నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరితీసేందుకు సర్వం సిద్ధమైంది. వీరికి ఉన్న న్యాయ, రాజ్యాంగపరమైన అవకాశాలన్నీ ముగిశాయి. ఇవాళ పవన్ గుప్తా క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయగా.. తాజాగా అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా తిరస్కరించారు. దాంతో నలుగురు దోషులు ముకేష్, పవన్ గుప్తా, వినయ్, అక్షయ్‌కు మంగళవారం ఉదయం తీహార్ జైలులో ఉరిశిక్ష విధించనున్నారు. ఉరి అమలుకు సంబంధించి జైలు అధికారులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు.

    నిర్భయ దోషులకు ఇప్పటికే రెండు సార్లు ఉరిశిక్ష వాయిదా పడింది. పక్కా ప్రణాళికతో ఉరిశిక్షను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తమకున్న న్యాయపరమైన అవకాశాలను విడతలవారీగా వినియోగించుకొని.. ఉరిశిక్షను వాయిదా వేస్తూ వచ్చారు. ఐతే అప్పుడు వాళ్లకున్న అవకాశాలన్నీ ముగియడంతో మంగళవారం ఉరిశిక్ష అమలుకానుంది.

    2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థినిపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో గ్యాంగ్ రేప్ జరిగింది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి మర్మాంగాల్లోకి పదునైన వస్తువులను జొప్పించడంతో తీవ్రగాయాలపాలైంది. డిసెంబర్ 29న సింగపూర్‌లోని ఎలిజబెత్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులంతా దోషులుగా తేలారు. దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. దోషిగా తేలిన మైనర్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన నలుగురికి మరణశిక్ష విధించారు. మార్చి 3న తీహార్ జైల్లో వీరిని ఉరితీయనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: