హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయ దోషుల ఉరిని లైవ్‌లో చూపించాలి.. సుప్రీంకోర్టులో పిల్

నిర్భయ దోషుల ఉరిని లైవ్‌లో చూపించాలి.. సుప్రీంకోర్టులో పిల్

నిర్భయ దోషులు

నిర్భయ దోషులు

నలుగురు నిందితులను ఉరితీయడాన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

  నిర్భయ దోషులను త్వరలోనే ఉరి తీస్తారని ప్రచారం జరుగుతోంది. 10 ఉరి తాళ్లను సిద్ధం చేయాలంటూ తీహార్ జైలు అధికారులు ఇప్పటికే బక్సర్ జైలుకు లేఖ రాశారు. అంతేకాదు తలారిని సిద్ధంగా ఉంచాలని ఉత్తరప్రదేశ్‌ జైళ్ల శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా వారిని ఉరితీస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో నిర్భయ దోషుల ఉరి శిక్షపై ఓ పిల్ దాఖలైంది. నలుగురు నిందితులను ఉరితీయడాన్ని టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.

  ''నిర్భయ దోషులు దాఖలు చేసిన రివ్యూ, క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్లన్నంటికీ తిరస్కరించాలి. వీలైనంత త్వరగా డెత్ వారంట్ జారీ చేసి నెల లోపే నలుగురు దోషులను ఉరితీయాలి. ఉరి తీయడాన్ని టీవీల్లో టెలికాస్ట్ చేసి దేశ ప్రజలందరికీ చూపించాలి. అమెరికా తరహాలో నిర్భయ తల్లిదండ్రులను తీహార్ జైలుకు తీసుకెళ్లి వారి ముందే దోషులను చంపేయాలి.'' అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

  కాగా, నిర్భయ కేసు దోషి అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను డిసెంబరు 17న విచారించనుంది కోర్టు. నిర్భయ కేసులో మిగతా ముగ్గురు దోషులు ముకేశ్ (30), పవన్ గుప్తా (23), వినయ్ శర్మ (34) రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా.. 2018 జూలై 9న సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది. ఐతే అక్షయ్ కుమార్ (31) మాత్రం గతంలో రివ్యూ పిటిషన్ వేయలేదు. తాజాగా అక్షయ్ తరఫున ఆయన లాయర్ ఏపీ సింగ్ మంగళవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఉరశిక్షలు నేరస్తులను మాత్రమే చంపగలవని... కాని నేరాలను నిర్మూలించలేవని పిటిషన్‌లో పేర్కొన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Nirbhaya, Supreme Court

  ఉత్తమ కథలు