నిర్భయ దోషుల ‘ఉరి’పై ఉత్కంఠ.. తీహార్ జైలుకు చేరిన తలారి..

ప్రతీకాత్మక చిత్రం

రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ (Nirbhaya) దోషులకు ఒకేసారి ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిక్షను వేసే తలారీ పవన్ జల్లాద్ గురువారమే తీహార్ జైలుకు చేరుకున్నాడు.

  • Share this:
    నిర్భయ దోషుల ఉరిపై ఉత్కంఠ కలుగుతోంది. ఓవైపు అధికారులు ఉరితీతకు ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు (ఫిబ్రవరి 1) ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో శిక్షను వేసే తలారీ పవన్ జల్లాద్ గురువారమే తీహార్ జైలుకు చేరుకున్నాడు. ఈ రోజు ఆయన అధికారుల పర్యవేక్షణలో డమ్మీ ఉరి వేయనున్నాడు. ఉరితాడు సామర్థ్యం సహా ఇతర విషయాలను కూడా పరిశీలిస్తాడు. నిర్భయ దోషుల ఉరి ఏకకాలంలో అమలు చేసేందుకు బక్సర్ నుంచి ప్రత్యేక తాళ్లను తెప్పించగా, జైలు ప్రాంగణంలోని మూడో నంబరు గదిలో నలుగురిని ఒకేసారి ఉరి తీయనున్నారు.

    అయితే, ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని దోషులు పెట్టుకున్న పిటిషన్‌ను ఈ రోజు విచారించనున్నారు. అటు.. మరో దోషి వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో.. నిర్భయ దోషుల ఉరి ఆలస్యం కానుందా? అన్న ఉత్కంఠను రేపుతోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: