దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ హత్యాచారం ఉదంతంలో దోషులకు ఉరి అమలు చేసే బాధ్యతను తలారి పవన్ జల్లాద్ కు అప్పగించారు. అయితే నిర్భయ దోషులకు ఉరి తీసే ముందు తలారిగా వ్యవహరిస్తున్న పవన్ జల్లాద్ ఒక పనిచేయాలనుకున్నారని, అయితే తన సన్నిహితుడు ఒకరు హెచ్చరించడంతో ఆగిపోయినట్లు సమాచారం అందుతోంది. ఏంటంటే పవన్ జల్లాద్ నిర్భయ దోషులకు ఉరితీసే 5 నిమిషాలకు ముందు జైలు అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారుల ముందు తన వ్యక్తిగత డిమాండ్ ఒకటి పెడదాం అనుకున్నాడట. అయితే అందుకు ఇది సమయం కాదని అతడి స్నేహితుడు ఒకరు హెచ్చరించడంతో పవన్ జల్లాద్ వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఇంతకీ పవన్ జల్లాద్ ఉరి తీసే ముందు ఏం చెప్పాలనుకున్నాడు అంటే...తన జాతి ఢేహ్ ఛాజ్ కులాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ లో చేర్చాలని అందరి ముందు నినాదాలు ఇద్దాం అనుకున్నాడని, అయితే తాను వద్దని చెప్పడంతో ఆగిపోయినట్లు పవన్ స్నేహితుడు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. దేశం యావత్తు ఎదురుచూస్తున్న ఈ తరుణంలో ఇలాంటి వివాదాలు తలెత్తడం సముచితం కాదని పవన్ కూడా భావించి వెనక్కుతగ్గినట్లు సమాచారం.
ఇదికూడా చూడండి :
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nirbhaya case