హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయకు నిజమైన నివాళి...సోషల్ మీడియాలో వెల్లువెత్తిన స్పందన....

నిర్భయకు నిజమైన నివాళి...సోషల్ మీడియాలో వెల్లువెత్తిన స్పందన....

Video : నిర్భయ దోషులకు ఉరి.. న్యాయం జరిగిందన్న తల్లి ఆశాదేవి

Video : నిర్భయ దోషులకు ఉరి.. న్యాయం జరిగిందన్న తల్లి ఆశాదేవి

గడిచిన ఏడు సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం దక్కింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఆలస్యం అయి ఉండవచ్చు. కానీ సరైన శిక్ష అమలు అయ్యిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

తీహార్ జైలులో తెల్లవారుజామున నిందితులు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలకు ఉరిశిక్ష అమలు చేసిన అనంతరం, సోషల్ మీడియాలో నిర్భయకు అసలైన నివాళి దక్కిందంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం నిర్భయ నిందితులకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. దక్షిణాసియాలో అతిపెద్ద జైలుగా పేరుగాంచిన తీహార్ జైలులో నిందితులను ఉరితీశారు. దీంతో గడిచిన ఏడు సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లిదండ్రులకు న్యాయం దక్కింది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఆలస్యం అయి ఉండవచ్చు. కానీ సరైన శిక్ష అమలు అయ్యిందని సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

First published:

Tags: Nirbhaya case

ఉత్తమ కథలు