హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నిర్భయ దోషుల మృతదేహాలు పోలీసులకు అప్పగింత...పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలింపు...

నిర్భయ దోషుల మృతదేహాలు పోలీసులకు అప్పగింత...పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలింపు...

మృతదేహాలు ఆసుపత్రికి తరలింపు

మృతదేహాలు ఆసుపత్రికి తరలింపు

ఉరితీత అనంతరం వైద్యుల ధ్రువీకరణ అనంతరం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దోషుల మృత దేహాలను ఆసుపత్రికి తరలించగా, అక్కడే పోస్టు మార్టం నిర్వహించనున్నారు.

తీహార్ జైలులో నిర్భయ దోషులకు ఉరి అమలైంది. ఉరితీత అనంతరం వైద్యుల ధ్రువీకరణ అనంతరం మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత దోషుల మృత దేహాలను ఆసుపత్రికి తరలించగా, అక్కడే పోస్టు మార్టం నిర్వహించనున్నారు. పోస్టు మార్టం చేసే సమయంలో వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఒకే రోజు నలుగురు దోషులకు ఉరితీసిన రికార్డు తీహార్ జైలు పేరిట నమోదు అయ్యింది. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. జైలు నెంబర్ 3 సూపరిండెంట్ సునీల్, ఎడిషనల్ ఐజీ (జైల్) అలాగే రాజ్ కుమార్ శర్మ, జైలు లీగల్ ఆఫీసర్ గత 24 గంటలుగా నిద్రాహారాలు మాని ఉరి తీసేందుకు సన్నాహాలను దగ్గరుండి పర్యవేక్షించినట్లు సమాచారం. అయితే ఉరి తీసే ముందు నిర్భయ దోషులు రాత్రంతా రోదించారని, నిద్ర పోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఉరి నేపథ్యంలో అన్ని బ్యారక్ లను మూసివేసినట్లు జైలు అధికారులు తెలిపారు.

ఉరిశిక్ష విధించిన సందర్భంగా తిహార్ జైలులో ఉన్న తోటి ఖైదీలందరినీ లాకప్ గదుల్లో మూసి ఉంచారు. తిహార్ జైలులో భద్రతను పర్యవేక్షిస్తున్న పోలీసులు నిర్భయ దోషులను ఉరి తీసే గంట ముందు లాకప్ గదులన్నింటినీ మూసివేశారు. నలుగురికి ఉరి తీశాక తిహార్ జైలు లాకప్ గదులను తెరిచారు. అప్పటివరకు ఖైదీలందరినీ నిర్బంధంలో ఉంచారు.


First published:

Tags: Nirbhaya, Nirbhaya case

ఉత్తమ కథలు