హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nirbhaya Case: తీహార్ జైలులో రేపిస్టులకు ఉరి...నిర్భయకు నివాళి...

Nirbhaya Case: తీహార్ జైలులో రేపిస్టులకు ఉరి...నిర్భయకు నివాళి...

Nirbhaya Case : ప్రతీకాత్మక చిత్రం

Nirbhaya Case : ప్రతీకాత్మక చిత్రం

జైలు గోడల మధ్యలోనే ఉన్మాదులైన దోషుల్లో నలుగురికి ఉరిశిక్షను అమలు చేశారు. భారత శిక్షా స్మృతిలో అత్యంత కఠినమైన శిక్షగా పిలువబడే ఉరితో నిర్భయ దోషులను చట్టం దండించింది.

యావత్ దేశాన్ని సంచలనానికి గురిచేసిన నిర్భయ కేసులో దోషులకు మరణదండన అమలైంది. సుప్రీం కోర్టులో నిర్భయ దోషుల చివరి ప్రయత్నాలు బెడిసికొట్టడంతో, పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం ఈ రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలైంది. తీహార్ జైలులో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషులు ముఖేశ్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్‌, వినయ్‌ శర్మలను తీహారు జైలులో మెజిస్ట్రేట్ సమక్షంలో ఉరిశిక్ష అమలు చేశారు. జైలు నంబరు 3లో ఒకేసారి నలుగురు దోషులను ఒకేసారి ఉరితీశారు. ఈ సమయంలో 17 మంది సిబ్బంది అక్కడ ఉన్నట్లు సమాచారం. 21వ శతాబ్దంలో యావత్ భారత్ దేశాన్ని కదిలించిన అత్యంత దారుణమైన అత్యాచారం కేసులో నిర్భయకు 7 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత న్యాయం దక్కింది. జైలు గోడల మధ్యలోనే ఉన్మాదులైన దోషుల్లో నలుగురికి ఉరిశిక్షను అమలు చేశారు. భారత శిక్షా స్మృతిలో అత్యంత కఠినమైన శిక్షగా పిలువబడే ఉరితో నిర్భయ దోషులను చట్టం దండించింది.

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు

తెల్లవారుజామున నలుగురి ఆరోగ్య పరిస్థితి బాగుందని తిహార్‌ జైలు అధికారులు వెల్లడించిన అనంతరం. ఉరిశిక్ష అమలు చేశారు. మరోవైపు ఉరితీత నేపథ్యంలో అధికారులు జైలును లాక్‌డౌన్‌ చేశారు. జైలు బయట మీడియా పెద్ద సంఖ్యలో గుమిగూడింది. నిర్భయ దోషులకు ఉరి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిహార్‌ జైలు ప్రధాన ద్వారం ఎదుట సీఆర్పీఎఫ్‌ సిబ్బంది పెద్ద సంఖ్యలో మోహరించారు. తిహార్‌ జైలులో చివరి సారిగా ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరి తీశారు. మళ్లీ ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఉరి తీయనున్నారు. ఒకేసారి నలుగురిని ఉరితీయడం తిహార్‌ జైలులో ఇదే తొలిసారి.


ఇదికూడా చూడండి :

First published:

Tags: Nirbhaya case

ఉత్తమ కథలు