పాకిస్థాన్ గుండెల్లో పిడుగు వేసిన భారత్...నిర్భయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

నిర్భయ్ క్షిపణి ప్రత్యేకత విషయానికి వస్తే.. 700 కి.మీ నుంచి 1000 కిలో మీటర్ల రేంజ్‌లో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించవచ్చు. అలాగే అన్నిరకాల వార్ హెడ్లను మోసుకెళ్లడంలో కూడా నిర్భయ్ క్షిపణి సిద్ధంగా ఉంది.

news18-telugu
Updated: April 15, 2019, 5:24 PM IST
పాకిస్థాన్ గుండెల్లో పిడుగు వేసిన భారత్...నిర్భయ్ క్షిపణి ప్రయోగం సక్సెస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిషాలో ని బాలాసోర్ నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఝానంతో తయారుచేసిన లాంగ్ రేంజ్ సబ్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగించారు. ఈ మిసైల్‌కు నిర్భయ్ అని పేరుపెట్టడం విశేషం. సోమవారం ఉదయం 11.44 గంటలకు లాంచ్ కాంప్లెక్స్ నుంచి మిసైల్ ప్రయోగించినట్లు డీఆర్డీవో వర్గాలు ప్రకటించాయి. కాగా నిర్భయ్ ప్రయోగం పూర్తిగా సక్సెస్ అయినట్లు రక్షణ నిపుణులు ప్రకటించారు. నిర్భయ్ క్షిపణి ప్రత్యేకత విషయానికి వస్తే.. 700 కి.మీ నుంచి 1000 కిలో మీటర్ల రేంజ్‌లో విజయవంతంగా లక్ష్యాలను ఛేదించవచ్చు. అలాగే అన్నిరకాల వార్ హెడ్లను మోసుకెళ్లడంలో కూడా నిర్భయ్ క్షిపణి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తూ ఎక్కువ దూరం ప్రయాణించడం ఈ క్షిపణి ప్రత్యేకత. అలాగే వివిధ సబ్ సోనిక్ వేగాల్లో నిర్భయ్ క్షిపణిని ఇప్పటికే ప్రయోగించారు. 0.7 మాక్ (ధ్వని వేగం) ప్రమాణంతో నిర్భయ్‌ క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, క్షిపణి ప్రయోగం బెంగుళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టా‌బ్లిష్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పటికే మొత్తం 6 సార్లు సూపర్ సోనిక్ క్షిపణులు పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఝానంతో రూపొందించిన రింగ్ లేజర్ గైరోస్కోప్, ఎంఈఎంఎస్ ఇనర్షియల్ నేవిగేషన్ సిస్టం ద్వారా నిర్భయ్ క్షిపణిని కంట్రోల్ చేయనున్నట్లు డీఆర్డీవో నిపుణులు తెలిపారు.
First published: April 15, 2019, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading