పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ.11 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి పరారీలో ఉన్న నిందితుడు నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. వజ్రాల వ్యాపారి అయిన నీరవ్ మోదీ పెట్టుకున్న పిటిషన్‌ను వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో నీరవ్ మోదీ ఆగస్ట్ 22 వరకు జైల్లోనే ఉండక తప్పదు. భారత్ నుంచి బ్రిటన్ పారిపోయిన నీరవ్ మోదీని స్కాట్లండ్ యార్డ్ పోలీసులు మార్చి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు. గత నెలలో నీరవ్ మోదీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను యూకే హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత తొలిసారి నీరవ్ మోదీని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. పంజాబ్ నేషనల్ స్కాంలో నీరవ్ మోదీ నేరుగా లబ్ధి పొందారని ప్రాసిక్యూషన్ వాదించింది. అనంతరం ఆగస్ట్ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.