Home /News /national /

NIRAV MODI ARREST GIVE NEW HOPE FOR BJP OPPOSITION TAKE ON ARREST

నీరవ్ మోడీ అరెస్టు బీజేపీలో కొత్త జోష్ నింపుతోందా ? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి ?

nirav modi

nirav modi

    ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ అరెస్టు దేశరాజకీయాల్లో సంచలనంగా మారింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు చౌకీదార్ చోర్ హై...అని ప్రధాని మోడీని ఇరుకున పెడుతుండగా, తాజాగా నీరవ్ మోడీ అరెస్టు బీజేపీకి నైతిక బలాన్నిచ్చింది. ముఖ్యంగా ప్రధాని మోడీ మొదలు పెట్టిన "మై భీ చౌకీదార్" కేంపెయిన్ బలంగా తీసుకెళ్లేందుకు నీరవ్ మోడీ అరెస్టు దోహదపడిందనే చెప్పవచ్చు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఇరుకున పెట్టేందుకు నీరవ్ మోడీ, విజయ్ మాల్యా విదేశాలకు పరారీ అంశాన్ని తరచూ వాడుతున్నారు.

    PM Changes Name on Twitter to 'Chowkidar Narendra Modi'; Amit Shah, Union Ministers, BJP CMs Follow Suit
    pm modi, amith sha


    నీరవ్ మోడీ అరెస్టు బీజేపీలో నూతన ఉత్సాహం ఇస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా ఎలక్షన్ స్టంట్ అని పెదవి విరుస్తున్నాయి. నీరవ్ మోడీ అరెస్టుపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ స్పందిస్తూ.. అసలు నీరవ్ మోడీని విదేశాలకు పంపింది ఎవరు.. ? దీన్ని మీ విజయం చెప్పుకునే అర్హత ఉందా ? అని ప్రశ్నించారు.



    అలాగే మరో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ సైతం స్పందిస్తూ.. నీరవ్ దేశం దాటించేందుకు బీజేపీ సహకరంచిందని, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్నికల తర్వాత తిరిగి నీరవ్ విదేశాలకు వెళ్లిపోతాడని ఆజాద్ విమర్శించారు.



    నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సైతం నీరవ్ మోడీ అరెస్టుపై స్పందిస్తూ ... బీజేపీ నీరవ్ అరెస్టు క్రెడిట్ తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, నిజానికి ఆ క్రెడిట్ టెలిగ్రాఫ్ పత్రిక కరస్పాండెంట్‌కు ఇవ్వాలని ట్వీట్ చేశారు.



    ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం నీరవ్ మోడీ అరెస్టును బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు మై భీ చౌకీదార్ కేంపెయిన్ ను వాడుకుంటోంది. ఇప్పటికే ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఉన్న వాచ్ మెన్లతో ఒక భారీ ముఖాముఖి కార్యక్రమం చేపట్టగా, దేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ నేతలు తమ పేర్ల ముందు చౌకీదార్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
    First published:

    Tags: Bjp, Lok Sabha Election 2019, Narendra modi, Nirav Modi

    తదుపరి వార్తలు