హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

India-China: 15 గంటల పాటు సాగిన భారత్, చైనా చర్చలు.. హామీలను గాలికొదిలేస్తోన్న డ్రాగన్

India-China: 15 గంటల పాటు సాగిన భారత్, చైనా చర్చలు.. హామీలను గాలికొదిలేస్తోన్న డ్రాగన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్-చైనా 9వ విడత చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 02.30 గంటల వరకు సాగాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకునే అంశంపై భారత్-చైనా 9వ విడత చర్చలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున 02.30 గంటల వరకు సాగాయి. 15 గంటల పాటు సాగిన ఈ భేటీలో ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ గురించి జరిగాయి. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్ లో లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఏసీ) మోల్డో బోర్డర్ గురించి చర్చించారు. గత సమావేశాలకు ప్రాతినిధ్యం వహించిన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధులే ఈ భేటీకి హాజరయ్యారు. పాంగ్ యాంగ్ సరస్సు ఉత్తర వైపున  ఉద్రిక్తతను తగ్గించడం లక్ష్యంగా చర్చలు సాగనున్నాయి. గతేడాది ఇదే ప్రదేశంలో హింసాత్మక ఘర్షణలు జరిగాయి. దశలవారీగా ఏకాభిప్రాయం తీసుకురావడంపై దృష్టి కేంద్రికరించారు. మొదట ఉత్తర వైపును తర్వాత దక్షిణం, అనంతరం దేప్సాంగ్, ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. గత ప్రతిపాదనలకు అనుగుణంగా పాంగ్ యాంగ్ సరస్సుకు ఉత్తర ఒడ్డు అయిన ఫింగర్ ప్రదేశం.. తాత్కాలికంగా నో మ్యాన్ ల్యాండ్ గా మారవచ్చు. భారత్ లేదా చైనా దళాలు ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించకపోయినట్లయితే ఉద్రిక్తతను తగ్గించి ప్రతిష్టంభనను నిలువరించవచ్చు.

దశలవారీగా విస్తరించడం కోసం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 మధ్య వివాదాస్పద ప్రాంతంలో కొంతకాలం పాటు పెట్రోలింగ్ నిర్వహించరు. ఫలితంగా దళాలను మోహరించడం, ఆయుధాలు సేకరించండం లాంటివి లేకుండా గతేడాది ఏప్రిల్లో ఉన్న పరిస్థితులను తీసుకురానున్నారు. పాంగ్ యాంగ్ సరస్సు దక్షిణ భాగంలో ఉన్న కైలాస పర్వత శ్రేణిలో ఆక్రమించిన భూభాగాలను భారత్ ఖాళీ చేయాలని చూస్తోంది. కౌంటర్ ఆపరేషన్లో భారత్ నో మ్యాన్ లాండ్ ను ఆక్రమించింది. మోల్డోలోని చైనా సైనక బలగాలు ఈ ప్రాంతాలను పట్టించుకోకపోవడంతో వ్యూహాత్మక ప్రయోజనం లభించింది. భారత్, చైనా వారి ప్రస్తుత స్థానాల నుంచి పరస్ఫరం పాంగ్ యాంగ్ ఉత్తర ఒడ్డు వరకు వెనక్కి తగ్గితే ఫింగర్ 8 పరిధిలోకే వస్తుంది. అదే వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అని భారత్ పేర్కొంది.

యథాతథ స్థితికి ఉల్లంఘన..

చైనా బలగాలు ఫింగర్-8, ఫింగర్-4 మధ్య 8 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేలా బంకర్లు ఏర్పాటు చేశారు. ఇది యథాతథ స్థితికి స్పష్టమైన ఉల్లంఘనగా భారత్ స్పష్టం చేసింది. ఫింగర్ 4, ఫింగర్ 8 మధ్య ఉన్న ప్రదేశంలో ఇరువైపులా పెట్రోలింగ్ చేస్తారు. ఇది తరచూ ఉద్రిక్తతలకు, ఘర్షణకు దారితీస్తుంది. గత 5-6 ఏళ్లుగా సైనిక బలగాలతో దెప్సాంగ్ మైదానాల్లో ఉద్రిక్తంగా మారింది. మూడో దశలో వీటిపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే అవకాశముందని అధికారిక వర్గాలు తెలిపాయి.

8వ విడత చర్చల్లో ఏ జరిగింది..

రెండున్నర నెలలో క్రితం నవంబరు 6న చుషుల్ వద్ద ఇరుపక్షాలు తమ బలగాలను ఉపసంహరించుకోవాలని విస్తృతంగా చర్చించాయి. ఇరుదేశ నాయకులు చేరుకుని ఏకాభిప్రాయం కోసం మనస్ఫూర్తిగా అమలు చేయడానికి ఉభయులు అంగీకరించారు. ఇరు దేశాల బలగాల అపార్థాలు, తప్పుడు లెక్కలను నివారించి సంయమనం పాటించాలని ఇరుపక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మరిన్ని మోహరింపులకు దిగకుండా సంయమనం పాటిద్దామంటూ చైనా సైన్యం గతేడాది సెప్టెంబరు 21న జరిగిన చర్చల్లోనూ భారత్ కు ప్రతిపాదించడం గమనార్హం. అయితే ఈ ప్రకటనకు తూట్లు పొడుస్తూ తాజాగా సైనిక బలగాలను మోహరించింది డ్రాగన్ దేశం. అయితే భారత్ కూడా ఇందుకు దీటుగా ప్రతిస్పందిస్తోంది.

అసలేం జరిగింది?

ఇరుదేశాల మధ్య ఘర్షణలు దశాబ్దాల తరబడి ఉన్నప్పటికీ 1962 తర్వాత ఆ స్థాయిలో ఆందోళనలు 2017లో ప్రారంభమయ్యాయి. 73 రోజుల పాటు డోక్లాం సంక్షోభం తలెత్తింది. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మాణాణికి చైనా యత్నించగా.. భూటాన్ కు దన్నుగా భారత బలగాలు రంగంలోకి దిగాయి. 73 రోజుల పాటు సాగిన ఈ ఉద్రిక్తతలు ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తలపించాయి. అయితే అనంతరం ఉభయుల చర్చల తర్వాత బలగాలు ఉపసంహరించుకున్నారు. రోడ్డు నిర్మాణం ఆగిపోయింది. అయితే గతేడాది జూన్ 15న గాల్వాన్ లోయ వద్ద చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం సంభవించినా ఆ దేశం మాత్రం అధికారింగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ఘటనకు ముందే ఇరుదేశాల మధ్య తొలిసారి చర్చలు జరిగాయి. అప్పటి నుంచి ప్రతి సారి చర్చలు జరగడం చైనా వాటిని విస్మరించి ఘర్షణలకు కాలుదువ్వడం పరిపాటిగా మారింది.

First published:

Tags: Defence Ministry, India, India-China, Indo China Tension

ఉత్తమ కథలు