శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఊహించని ప్రమాదం జరిగింది. కారు రోడ్డుపక్కన ఉన్న నీటి గుంతలోకి దూసుకెళ్లి.. 9 మంది మరణించారు. కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బీహార్ (Bihar Accident) లోని పూర్నియా జిల్లాలో శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Purnia Road Accident) చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కిషన్గంజ్ జిల్లా నునియా గ్రామానికి చెందిన ఓ యువతికి తారాబరి ప్రాంతానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి కూతురు తరపు వారంతా అబ్బాయి ఇంటికి వెళ్లి తిలక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత.. స్కార్పియో వాహనంలో తిరిగి బయలుదేరారు. ఆ వాహనంలో 11 మంది ఉన్నారు.
Fire breaks: ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఐసీయూకు వ్యాపించిన మంటలు..
ఐతే స్పార్పియో పూర్నియా జిల్లా కంజియా సమీపంలోకి రాగానే.. అదుపుతప్పింది. రోడ్డు కిందకు దూసుకెళ్లి.. అక్కడే ఉన్న ఓ నీటి గుంతలో పడింది. ఆ గుంత చూసేందుకు చిన్నగా అనిపించినా.. లోతు ఎక్కువగా ఉంది. చూస్తుండగానే స్కార్పియో వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. అందులోని ఇద్దరు ప్రయాణికులు ఎలాగోలా తప్పించుకొని బయటపడ్డారు. మిగతా వారికి తప్పించుకునే అవకాశం లేకుండాపోయింది. స్కార్పియో వాహనంతో పాటు నీటిలో మునిగిపోయి..ఊపిరాడక మరణించారు. కొందరు అద్దాల నుంచి బయటకు వచ్చినా.. ప్రాణాలు దక్కలేదు. నీటి లోతు ఎక్కువగా ఉండడంతో..మరణించారు.
OMG: తండ్రికి ఫోన్ చేసి కిడ్నాప్ డ్రామా... కారణం తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం
ఘటనపై సమాచారం అందించిన వెంటనే పోలీసులు వెళ్లారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. 9 మంది స్పాట్లోనే మరణించారు. గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సాయంతో వాహనాన్ని నీటి గుంత నుంచి బయటకు తీశారు. మృతులంతా కిషన్ జిల్లా వాసులేనని సీఐ రాజశేఖర్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించినట్లు చెప్పారు. స్కార్పియో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల.. అతివేగంతో అదుపుతప్పిందని పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగిపోయారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి పనులు ప్రారంభం కావాల్సి ఉండగా.. అంతలోనే ఈ ఘోరం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Road accident